ఆదివారం రాత్రి ఎపిసోడ్ మొత్తం ఎమోషన్ తో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్.. మెహబూబ్ ఎలిమినేషన్ ని జీర్ణించుకునేలోపే మల్లి మండే వార్ మొదలైంది. సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ గరం గరంగా మారింది. హౌస్ లోని సభ్యులు ఇద్దరిని నామినేట్ చెయ్యడానికి హార్ట్ లో కత్తి దింపే ప్రక్రియలో మోనాల్ అవినాష్ ని నామినేట్ చేస్తూ హార్ట్ లో కత్తి దించడమే కాదు.. దానికి తగిన కారణం చెప్పగా అవినాష్ ఎప్పటిలాగే డీఫన్డ్ చేసుకున్నాడు. ఇక లాస్య ని అరియనా అక్కా నన్ను మీరు అరియానా నాకు పోటీ కాదన్నారంటూ నామినేట్ చేసింది.
అవును ఇప్పుడూ అదే చెబుతున్న నువ్వు నాకు పోటీ కాదంటూ లాస్య ఓపెన్ అయ్యింది. ఇక మొదటి వారం నుండి అరుపులు కేకలు వేసిన.. సోహైల్ అందరి దృష్టిలో మంచివాడిగానే ఉన్నాడు. కానీ గత రెండు వారాలుగా నామినేట్ అవుతున్నాడు. తాజాగా సోహైల్ కి అభిజిత్ కి మధ్యన మినీ యుద్ధమే నడించింది. నువ్వు సింగరేణి ముద్దు బిడ్డవైతే.. నీ ఊతపదాలు నీ దగ్గరనే ఉంచుకో అని అభి సోహైల్ ని అనగా.. సోహైల్ నేను ఇంతే ఇట్లనే ఉంటా.... నీ కోసం మారాను.. నువ్వు క్లాస్ నేను మాస్.. హాయ్ బ్రదర్, హలొ బ్రో అంటూ నేను ఉండను అంటూ రెచ్చిపోగా దానికి అఖిల్ కూడా వంట పాడాడు.
అభిజిత్ - సోహైల్ మధ్యన రచ్చ మాములుగా లేదు. ఇక సోహైల్, హారికాని కూడా నన్ను దేకుతావ్ అన్నావ్.. నేను మరీ అంత గలీజ్ గాడినా అని అరవగా.. హారిక కూడా నేను నీకన్నా ఎక్కువగా అరవగలను ఏమనుకుంటున్నావో అంటూ సోహైల్ ని ఆడుకుంది. మరి తాజాగా బిగ్ బాస్ ప్రో చూస్తుంటే... ఈ రోజు ఎలిమినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ లో ఓ మినీ యుద్ధం గ్యారెంటీ అనిపిస్తుంది.