చిరంజీవి ఒకప్పుడు మెగా స్టార్. తొమ్మిదేళ్లు సినిమాలు వదిలేసినా.. చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే రామ్ చరణ్ తండ్రి క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి కొణిదెల ప్రొడక్షన్స్ పెట్టి తండ్రి సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఆచార్య సినిమాకి మరో నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మాణం చేపట్టిన రామ్ చరణ్ తదుపరి చిరు చిత్రాలను వేరే నిర్మాతలకు వదిలిపెట్టాడు. ఆచార్య తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇంకా ప్రకటన రాలేదు కానీ... ఇప్పుడు వేదలమ్ రీమేక్ కి చిరు తీసుకునే పారితోషకంపై ఫిలిం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి.
ఏకే ఎంటర్టైన్మెంట్ లో అనిల్ సుంకర నిర్మాణంలో మెహర్ రమేష్ డైరెక్ట్ చేసే వేదాళం రీమేక్ కి చిరు పారితోషకం ఫిక్స్ అయ్యింది అని.. ఆచార్య కోసం 50 కోట్లు అందుకుంటున్న చిరంజీవి.. వేదాళం రీమేక్ కి మరో పది కోట్లు ఎక్స్ట్రా అంటే.. 60 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడని.. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయంటూ ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చర్చలకు తెర లేపింది. మరి చిరు పారితోషకం 60 కోట్లు అంటే.. ఆ సినిమా బడ్జెట్ రేంజ్ ఎంత ఉండాలి. అది సరే అసలు ఇంకా పట్టాలెక్కని ఈ సినిమాకి అప్పుడే చిరు పారితోషకంపై వస్తున్నా వార్తల్లో నిజమెంతుందో కానీ.. ప్రస్తుతం ఈ సినిమా చిరు - మెహర్ కథా చర్చలు, ప్రకటన వరకు వచ్చింది.. కానీ పారితోషకాలు ఇంకా ఫిక్స్ అయినట్లుగా క్లారిటీ లేదంటున్నాయి మెగా వర్గాలు.