ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాక రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంతే హీరోయిన్స్ కి భీభత్సమైన క్రేజ్. దర్శకులు కూడా ఎప్పుడెప్పుడు విజయ్ తో సినిమా చేస్తామా అని కలలు కంటుంటారు. ఇక హీరోయిన్స్ ని ఏ హీరో తో సినిమా చెయ్యాలని ఉంది, ఏ హీరో అంటే క్రష్ అని అడిగితె వేంటనే విజయ్ దేవరకొండ పేరు చెప్పేంత క్రేజ్ విజయ్ కి వచ్చేసింది. పూరి జగన్నాధ్ ఫైటర్ తో పాన్ ఇండియా లోకి అడుగుపెడుతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓ హీరోయిన్ ని ఓ దర్శకురాలిని పొగిడేస్తున్నాడు. మరి విజయ్ పొగిడాడు అంటే ఆ హీరోయిన్, ఆ డైరెక్టర్ కి ఏదో ప్రత్యేకత ఉండాల్సిందే.
ఆ సినిమా మరేదో కాదు.. దివాళి కానుకగా ఓటిటి నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాని తాజాగా వీక్షించిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమాలో సూర్య నటనని తెగ పొగిడేసాడు. మీరు టెర్రిఫిక్ పెరఫార్మెర్. మీ నటనకు మేము ప్రేమలో పడిపోతాం. అంతే కాదు.. నిర్మాతగానూ మీరు ఈ సినిమాని ఉన్నత స్థాయిలో ఉంచారు. అలాగే హీరోయిన్ అపర్ణ బాల కేరెక్టర్, ఆమె నటన నటనను చూసిన విజయ్ దేవరకొండ సుధా మేడం మీకు ఇలాంటి స్పెషల్, టాలెంటెడ్ హీరోయిన్స్ ఎక్కడ దొరుకుతారు. వాళ్ళ టాలెంట్ ని మీ గ్రిప్ లో ఉంచుకుంటారు. అపర్ణ బాల నటన అద్భుతం. ఇది నిజం తాను కేరెక్టర్ ని కమేండ్ చేసింది అంటూ ఆకాశం నీ హద్దురా హీరోయిన్ అపర్ణ బాల మీద , దర్శకురాలు సుధా కొంగర మీద ప్రశంశల వర్షం కురిపించాడు విజయ్ దేవరకొండ.