తెలుగు బిగ్ బాస్ చూసి బుల్లితెర ప్రేక్షకులు బాగా బోర్ ఫీలవుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా, ఆ నోటా ఈ నోటా బిగ్ బాస్ వరకు చేరినట్లుగా ఉంది. అందుకే బిగ్ బాస్ గేమ్ ప్లాన్ మార్చాడు. ఇప్పటివరకు హౌస్ మేట్స్ ఎంతగా గొడవలు పడినా.. వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలిసిపోయి.. బిగ్ బాస్ కి స్టఫ్ దొరక్కుండా చేసేసారు. దానితో బిగ్ బాస్ టీఆర్పీ పెంచుకోవడానికి అఖిల్ - మోనాల్ - అభిజిత్ అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించింది బిగ్ బాస్. ఈమధ్యన అఖిల్ - మోనాల్ లవ్ స్టోరీ కూడా పక్క దారి పట్టింది. అప్పటి నుండి బిగ్ బాస్ మరీ డల్ అయ్యింది.
దానితో బిగ్ బాస్ చూడడం తగ్గించారు ప్రేక్షకులు. అందుకేనేమో ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ చేసి కంటెస్టెంట్స్ నుండి తనకు కావల్సిన స్టఫ్ ని రాబట్టుకుంది. నేడు సోమవారం ఎలిమినేషన్స్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ మధ్యన అగ్గి రాజేసింది. అది అలాంటి ఇలాంటి అగ్గి కాదు.. మనోభావాలు తగలడిపోయేంత మంట పుట్టించింది. వరసగా ప్రోమోస్ వదులుతూ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించారు. మధ్యాన్నం సోహైల్ vs అభిజిత్ ప్రోమో వదిలిన బిగ్ బాస్ ఇప్పుడు అఖిల్ - అభిజిత్ కొట్లాట ప్రోమోతో ఈ రోజు హౌస్ ఎలా ఏం జరిగిందో చెప్పేసారు. అభిజిత్ ని నామినేట్ చేసిన అఖిల్ పులి మేక స్టోరీ తో అభిని రెచ్చగొట్టి వదిలాడు.
ఎప్పుడూ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండే అభిజీత్ రెచ్చిపోయి నా సోచ్ ఎక్కడ పడిపోయిందో నువ్వు చెప్పే మొనగాడివా.. అయినా సీక్రెట్ రూమ్ లో నాలుగు రోజులుండి.. సినిమా చూసి ఇక్కడికొచ్చి రివ్యూ ఇస్తావా.. నువ్వు నా ముందు బచ్చా గాడివి అంటూ వీర లెవల్లో అఖిల్ మీద రెచ్చిపోయాడు. నువ్వేమన్న తురుమువా, తోపువా అంటూ అఖిల్, అభిలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. ఇక అఖిల్ కూడా నువ్వు 30 ఏళ్ళకి ఇక్కడికి వస్తే నేను 25 ఏళ్లకే వచ్చా అంటూ అభిని రెచ్చగొడుతున్న ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
అసలు ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా హౌస్ లో మంట పెట్టేసింది. అఖిల్ - అభిజిత్ - సోహైల్ మధ్యన గొడవ తారాస్థాయికి చేరుకుంది, నువ్వెంతంటే నువ్వెంత అంటూ రెచ్చిపోయి గొడవపడ్డారు. అలాగే సోహైల్ - హారిక మధ్యన కూడా ఓ రేంజ్ లో గొడవ జరిగింది. ఇక ఈ రోజు నామినేషన్స్ లో ఉన్న లిస్ట్ లో అభిజిత్, హారిక, లాస్య, అరియానా, మోనాల్ ఉన్నారు. ఇక ఈ రోజు నామినేషన్స్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అసలు రూపాలు బయటికి వచ్చి.. బిగ్ బాస్ కి కావాల్సిన స్టఫ్ అందించారు. ఇది కదా బిగ్ బాస్ కి కావాల్సింది అనేలా ఉంది ఈ నామినేషన్ ఎపిసోడ్.