Advertisementt

డిసెంబర్ ని కన్ఫర్మ్ చేసిన మెగా హీరో!!

Thu 19th Nov 2020 04:57 PM
sai dharam tej,solo brathuke so better,theatre release  డిసెంబర్ ని కన్ఫర్మ్ చేసిన మెగా హీరో!!
Sai Tej Solo Brathuke So Better Theatrical Release Confirmed డిసెంబర్ ని కన్ఫర్మ్ చేసిన మెగా హీరో!!
Advertisement
Ads by CJ

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. సోలో బ్రతుకే సో బెటరు సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుని అటు ఓటిటికి అమ్మాలా.... లేదంటే థియేటర్స్ కోసం వేచి చూడాలా.. అనే కన్ఫ్యూజన్ లేకుండా తన సినిమా థియేటర్స్ లోనే అంటూ అప్పుడప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందరూ 50 శాతం అక్యుపెన్సీతో థియేటర్స్ రిలీజ్ వర్కౌట్ అవ్వదని తమ సినిమాలను సంక్రాంతికి ఫిక్స్ చేసుకుంటున్నారు. రవితేజ, నితిన్, అఖిల్ వరసబెట్టి సంక్రాంతికి కచ్చిఫ్ వేస్తుంటే సాయి ధరమ్ మాత్రం ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నాడు.

అంటే సోలో బ్రతుకే సో బెటరు సినిమాని అందరిలా సంక్రాంతికి ఫిక్స్ చేస్తాడేమో అనుకుంటున్న సమయంలో సోలో బ్రతుకే సో బెటరు డిసెంబర్ రిలీజ్ అంటూ ప్రకటన ఇచ్చేసాడు. డిసెంబర్ లో డేట్ ఇవ్వకపోయినా.. సినిమాని డిసెంబర్ లోనే విడుదలకు సిద్ధం చేస్తున్నట్టుగా పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేసాడు మెగా మేనల్లుడు. మరి తెలంగాణలోనూ థియేటర్స్ ఓపెనింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే సాయి ధరమ్ తేజ్ ధైర్యం చేసినట్టుగా కనబడుతున్నాడు. మరి 50 శాతం ఆక్యుపెన్సీ మీదే సినిమాని రిలీజ్ చేస్తాడా.. లేదంటే అప్పటికి 100 శాతం సీట్లు బుకింగ్ నడుస్తాయని నమ్మి తన సినిమాని థియేటర్స్ విడుదల అంటూ ఎనౌన్స్ చేశాడా.. అనేది సాయి ధరమ్ కే తెలియాలి. 

Sai Tej Solo Brathuke So Better Theatrical Release Confirmed:

Solo Brathuke So Better Theatrical Release in December

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ