Advertisementt

ఏదైనా స్ట్రయిట్ గా చెప్పగల దమ్మున్న హీరోయిన్!!

Thu 19th Nov 2020 10:26 PM
taapsee,bollywood,star hero wife  ఏదైనా స్ట్రయిట్ గా చెప్పగల దమ్మున్న హీరోయిన్!!
Actress Was Once Replaced Due To Hero’s Wife ఏదైనా స్ట్రయిట్ గా చెప్పగల దమ్మున్న హీరోయిన్!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరోలను, దర్శకనిర్మాతలు తన కామెంట్స్ తో ఒణికించగల సత్తా ఉన్న హీరోయిన్ కంగనా. కంగనా మాటకి మాట చెప్పగల మరో దమ్మున్న హీరోయిన్ తాప్సి. కంగనా తనలాంటి హీరోయిన్స్ ని బి గ్రేడ్ అనీ సంభోదిస్తే... వాటికి ఎలా సమాధానం చెప్పాలో తాప్సికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. దీపికా పదుకొనే, అలియా భట్ లాంటి టాప్ హీరోయిన్స్ కి కంగనా నోట్లో నోరు పెట్టడం నచ్చక వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. అలాగని తాప్సి ఊరుకోదు. తనేం చెప్పాలో అది స్ట్రయిట్ గా చెబుతుంది. తెలుగులో నాలుగైదు సినిమాలు చేసినా.. తాప్సికి ఇక్కడ వర్కవుట్ కాక బాలీవుడ్ కి చెక్కేసి.. అక్కడ కాస్త నిలబడ్డాక సౌత్ దర్శకులకు నడుము అందాలను, బొడ్డు అందాలు చూడడం తప్ప మరేం తెలియదని సంచలనంగా మాట్లాడింది. 

తాజాగా తాప్సి మరోమారు కాకపుట్టించే వ్యాఖ్యలతో హైలెట్ అయ్యింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా అవమానాలు, చాలా సమస్యలను ఎదుర్కొని నిలబడ్డానని.. హీరోయిన్స్ సినిమాల్లో నటించేందుకు హీరోల పర్మిషన్ కన్నా హీరోల భార్యల పర్మిషన్ కావాలంటూ హాట్ హాట్ వ్యాఖ్యలు చేసింది. ఒకసారి ఒక సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ కన్నా నా సీన్ బాగా వచ్చింది... దానితో ఆ హీరో భార్య నన్ను ఆ సినిమా నుండి తప్పించింది అంటూ సంచలనంగా మాట్లాడింది. మరి ఈ విషయమే కాదు.. ఏదైనా చెప్పాలంటే తాప్సి సూటిగా సుత్తి లేకుండా, గుచ్చుకునేలా చెబుతుంది అని మరోమారు స్పష్టమైంది. అయితే ఇంత చెప్పిన తాప్సి ఆ హీరో ఎవరు, ఆ హీరో భార్య ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. 

Actress Was Once Replaced Due To Hero’s Wife:

Taapsee On Her Initial Struggles In B-Town

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ