మెగా డాటర్ నిహారిక పెళ్లి మరో 20 రోజుల్లో జరగబోతుంది. డిసెంబర్ 9 రాత్రి నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఓ ప్యాలెస్ లో జరిపేందుకు మెగా ఫ్యామిలీ గ్రాండ్ ప్లాన్స్ లో ఉంది. ఇప్పటికే నిహారిక ఉదయపూర్ కి వెళ్ళిపోయింది. డిసెంబర్ లో ఐదు రోజుల పాటు నిహారిక - చైతన్య జొన్నలగడ్డ వివాహం కరోనా నింబంధనల మేరకు జరిపించబోతున్నట్టుగా తెలుస్తుంటే.. ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళకి నిహారిక తండ్రి నాగబాబు ఇవ్వబోయే కట్నం అదేనండి.. లాంఛనాల వివరాలు సోషల్ మీడియా కెక్కాయి.
డైరెక్ట్ గా వర కట్నం అనకుండా నిహారిక అలాగే అల్లుడు చైతన్య కి నాగబాబు గిఫ్ట్ కింద పది కోట్లతో పాటుగా హైదరాబాద్ లోని ఓ బంగ్లా అలాగే రెండు కోట్లు విలువ చేసే ఆభరణాలను పెట్టనున్నాడని.. ఇంకా పెళ్లి కొడుకు ఫ్యామిలీకి ఇచ్చిపుచ్చుకోవటాలు కింద దాదాపుగా ఓ కోటి ముట్టజెబుతున్నాడని.. ఇదంతా కట్నం రూపేణా కాకుండా లాంచనాలంటూ పని కానిచ్చేస్తున్నారట. మరి మెగా డాటర్ అంటే ఆ మాత్రం ఉండాలి. ఇక నిహారిక పెళ్ళికి ఇండస్ట్రీ ప్రముఖుల ఆహ్వానాలు అందినట్టుగా లేవు. మెగా ఫ్యామిలీ సన్నిహితులకు కూడా ఆహ్వానాలు అందలేదని.. కేవలం ఫ్యామిలీ మెంబెర్స్, కొద్దిమంది రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ మధ్యనే నిహారిక పెళ్లి జరగబోతున్నట్టుగా తెలుస్తుంది