కాజల్ అగర్వాల్ ఈమధ్యనే తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుని మాల్దీవులకు హాని మూన్ చెక్కేసింది. మాల్దీవుల్లో కాజల్ భర్త గౌతమ్ తో కలిసి రచ్చ రచ్చ చేసిన విషయంలో తెలిసిందే. మాల్దీవుల్లో భర్త కిచ్లు తో కాజల్ ఫొటోస్ షూట్స్, ఆమె హాని మూన్ బడ్జెట్ అంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే కాజల్ అగర్వాల్ కరోనా టైం లో సింపుల్ గా పెళ్లి చేసుకుని.. ఇండస్ట్రీలోని తన ఫ్రెండ్స్ కి కానీ, పెద్దలకి కానీ ఆహ్వానాలు ఇవ్వలేదు. అలాగే కాజల్ కనీసం రిసెప్షన్ కి కూడా ఎవరిని పిలవలేదు. దానితో కాజల్ ఫ్రెండ్స్ అంతా బాగా డిపోయింట్ అయ్యారు.
అందులో కాజల్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన మంచు లక్ష్మి... కాజల్ పార్టీ లేకుండా పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు హాట్ కామెంట్స్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ కాజల్ అగర్వాల్ కరోనా లాక్ డౌన్ లో సింపుల్ గా పెళ్లి చేసుకుని.. పెళ్లి పార్టీ ఇవ్వలేదని.. అలాగే కాజల్ తమకి పార్టీ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుంది. కాజల్ పార్టీ విషయంలో పిసినారిగా, చీప్ గా ఉండకు అంటూ కాజల్ ని హెచ్చరించింది. మరి మంచు లక్ష్మి కాజల్ పెళ్లి చేసుకున్నందుకు విషెస్ చెప్పడమే కాదు.. కాజల్ ని డైరెక్ట్ గా పెళ్లి పార్టీ కావాలంటూ మంచు లక్ష్మి అడిగిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది