Advertisementt

హద్దులు చెరిపేసా అంటున్న సమంత!!

Sat 21st Nov 2020 09:47 AM
samantha,the family man 2,negative role  హద్దులు చెరిపేసా అంటున్న సమంత!!
Samantha breaking boundaries of acting హద్దులు చెరిపేసా అంటున్న సమంత!!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సినిమాలు ఒప్పుకోవడం మానేసి.. కొత్తగా ట్రై చేస్తున్న సమంత ఆహా ఓటిటి కోసం సామ్ జామ్ టాక్ షో చేస్తుంది. విజయ్ దేవరకొండ దగ్గరనుండి మెగా స్టార్ చిరు వరకు టాప్ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ మాదిరి గేమ్స్ ఆడిస్తున్న సమంత.. తమిళ సినిమాలు చేస్తున్నా ఎందుకో తెలుగు సినిమాలను పక్కనబెట్టింది. ఈమధ్యన ప్రయోగాలను ఇష్టపడుతున్న సమంత ఇప్పుడు ఓ పాత్ర కోసం హద్దులు చెరిపేసాను అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. అది దేని కోసమో కాదు.. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ కోసమే.

బాలీవుడ్ లో యాక్షన్, డ్రామా, స్పస్పెన్స్ థ్రిల్లర్‌గా మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ముఖ్యపాత్రల్లో తెరకెక్కి అమెజాన్ ప్రైమ్ లో లక్షలాదిమందిని ఆకట్టుకున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కి సీక్వెల్ గా వస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాత్ర గురించి సామ్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పాత్ర కోసం ఇప్పటివరకు నటిగా నాకున్న హద్దులను చెరిపేశానని.. ఇప్పటివరకు ఫాలో అయినా రూల్స్ ని పక్కనబెట్టేసాను అని, ఈ వెబ్ సీరీస్ తో ఓ అద్భుతమైన ప్రయోగం చేసాను.. ద ఫ్యామిలీ మ్యాన్ అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది అంటూ ఫ్యామిలీ మ్యాన్ లో తన కేరెక్టర్ పై సమంత అందరిలో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. సమంత చెప్పింది అని కాదుగాని.. నిజంగానే ప్రపంచంలోని చాలామంది ప్రేక్షకులు ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు కూడా.

Samantha breaking boundaries of acting :

Samantha says that she has experimented a lot with her role in Family Man 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ