బిగ్ బాస్ 4 లో బోలెడన్ని ట్విస్ట్ లు లేకపోయినా.. దేవి, కుమార్ సాయి ఎలిమినేషన్స్ అప్పుడు నిజంగానే బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ బాస్ ట్విస్ట్ లు ఝలక్ లు ఇచ్చాడు. దేవి, కుమార్ సాయి లను మోనల్ గురించి ఎలిమినేట్ చెయ్యడం, అందులోను మోనాల్ ఇంతవరకు హౌస్ లో ఉండడానికి ఎలాంటి కారణం లేకపోయినా.. ఆమెని సేవ్ చెయ్యడం బుల్లితెర ప్రేక్షకులకు రుచించడం లేదు. కానీ బిగ్ బాస్ మాత్రం మోనాల్ ని ఇప్పటికి అంటే ఈ వారం కూడా సేవ్ చేసేసాడు. గత రాత్రి ఎపిసోడ్ లో నాగార్జున మళ్ళీ బిగ్ బాస్ కుటుంబ సభ్యులను స్టేజ్ మీదకి పిలిచి టాప్ 5 ఎవరో చెప్పమంటే అభిజిత్, అఖిల్, సోహైల్, అరియనా, హారిక అని చెప్పి లాస్య, మోనాల్, అవినాష్ లకు ఝలక్ ఇచ్చారు.
దానితో టాప్ 5 స్థానాలు ఫిక్స్ అయినట్టే కనబడుతుంది వ్యవహారం. ఇక తాజాగా ఎలిమినేషన్స్ లో ఈ రోజు ఇంటినుండి బయటికి వెళ్ళబోయేది లాస్య అని.. అయితే కుమార్ సాయి రీ ఎంట్రీ పై వస్తున్న వార్తలకు బిగ్ బాస్ చెక్ పెట్టి.. లాస్యాని బయటికి పంపి కుమార్ సాయి ని ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పించబోతున్నట్టుగా బిగ్ బాస్ లీకులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటి అంటే లాస్య వెళ్లిపోవడం, కుమార్ సాయి హౌస్ లోపలికి రావడమే. మరి మిగతా మూడు వారాల్లో కుమార్ సాయి ఏం ఆడతాడు.. అతను ఎలాగూ టాప్ కి వెళ్లే అవకాశం కూడా లేదు. కానీ ఎందుకు రీ ఎంట్రీ అనేది బుల్లితెర ప్రేక్షకులకు అర్ధం కానీ ప్రశ్న.