Advertisementt

అనన్య ని ఆకాశానికెత్తేస్తున్న రౌడీ హీరో!!

Mon 23rd Nov 2020 11:50 PM
vijay deverakonda,fighter heroine,ananya pande  అనన్య ని ఆకాశానికెత్తేస్తున్న రౌడీ హీరో!!
Fighter talks about His Heroine Ananya Pandey అనన్య ని ఆకాశానికెత్తేస్తున్న రౌడీ హీరో!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ప్రియాంక హవా తగ్గినా దీపికా ఇప్పటికీ టాప్ పొజిషన్ లోనే కొనసాగుతుంది. పెళ్లయినా దీపికా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కత్రినా కైఫ్ హవా తగ్గి కియారా హవా పెరుగుతుంది. ఈ మధ్యన ఏ సినిమా చూసినా కియారా అద్వానినే కనబడుతుంది. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ని బాలీవుడ్ సౌత్ టాప్ హీరోయిన్ అవడం ఖాయమంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆమె పూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ తో నటిస్తున్న అనన్య పాండే. విజయ్ తాజాగా అనన్య గురించి మాట్లాడుతూ.. అనన్య సూపర్, డూపర్ అనడమే కాదు.. నటనలో సూపర్, మంచి హృదయం ఉన్న హీరోయిన్, అనన్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం సూపర్ హ్యాపీ.

ఫైటర్ సినిమాలో అనన్య చాలా అద్భుతంగా నటిస్తుంది అంటూ అనన్యని ఆకాశానికెత్తేస్తున్నాడు. 50 శాతం పూర్తయిన సినిమాలో అనన్య నటన చాలా బావుంది.. సౌత్ లో అనన్య టాప్ పొజిషన్ కి వెళ్లడం ఖాయమంటూ అనన్య ని ఆకాశానికెత్తేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మరి రౌడీ హీరో అనన్యని అంతగా పొగుడుతున్నాడంటే.. అనన్యకి విజయ్ సినిమా పూర్తి కాకుండానే మరో తెలుగు సినిమా ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో. ఈ సినిమాతోనే అనన్య తెలుగులో డబ్బింగ్ చెప్పుకోబోతుందట. అలాగే ఈ సినిమాలోని అనన్య పాత్ర అనన్య నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది అని అనన్య చెబుతుంది. 

Fighter talks about His Heroine Ananya Pandey:

Vijay Deverakonda Praises on his Fighter Heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ