Advertisementt

నాగార్జున కి ఫెవరేట్ బిగ్ బాస్ కంటెస్టెంట్?

Tue 24th Nov 2020 11:12 AM
nagarjuna,bigg boss,akhil,abhijith,amala akkineni,bigg boss season 4  నాగార్జున కి ఫెవరేట్  బిగ్ బాస్ కంటెస్టెంట్?
Who is Nagarjuna's favorite Bigg Boss contestant? నాగార్జున కి ఫెవరేట్ బిగ్ బాస్ కంటెస్టెంట్?
Advertisement
Ads by CJ

నాగార్జున హోస్టింగ్ లో బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా ముగియగా... తాజాగా నాగార్జున సీజన్ 4 కి వ్యాఖ్యాతగా కూడా ఇరగదీస్తున్నాడు. సీజన్ 4 కి నాగార్జున ఒకే ఒక్క ఎపిపిసోడ్ కి స్కిప్ కొట్టగా.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో నాగ్ మంచి రిలేషన్ మెయింటింగ్ చేస్తూ.. మందలించాల్సిన టైం లో మందలిస్తూ.. ఫన్నీ టైం లో ఫన్నీగా ఉంటూ బిగ్ బాస్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. నాగార్జున కు కోపం వచ్చినా, కామెడీ చేసిన పర్ఫెక్ట్ గా సూటవుతుంది. ఇక శనివారం స్కూల్ పిల్లలకి క్లాస్ పీకినట్టుగా బిగ్ బాస్ సభ్యులను వారి తప్పులనుఎత్తి చూపిస్తూ వాటిని సరిదిద్దే నాగార్జునకి బిగ్ బాస్ సీజన్ 4 లో ఫెవరెట్ కంటెస్టెంట్ ఉన్నాడంటున్నారు. 

అతనెవరో కాదు అక్కినేని అమలకు నచ్చిన, కొడుకుల అభిమానించే అభిజిత్ నాగార్జునకి ఫెవరెట్ కంటెస్టెంట్ అని.. మొదట్లో అభిజిత్ ని స్ట్రాంగ్ చెయ్యడానికే అభిజిత్ ని మందలించిన నాగార్జున ఈమధ్యన అభిజిత్ ని ఎంకరేజ్ చేస్తున్నాడని.. ప్రతి వారం ఆభిజీత్ ని డాన్స్ చెయ్యమని, ఎంకరేజ్ చెయ్యడం, అభిజిత్ విషయంలో నాగార్జున కాస్త సాఫ్ట్  గా ఉంటున్నాడని.. అభిజిత్ ఫైనల్ విన్నర్ అవుతాడని నాగ్ కి ముందే తెలుసనీ.. అందుకే నాగార్జున అభి విషయంలో ఫెవరెట్ గా ఉన్నాడంటున్నారు సోషల్ మీడియా ఫాన్స్. మరి నాగ్ ఎపిసోడ్ చూసిన బుల్లితెర ప్రేక్షకులకు అభిజిత్ అంటే నాగ్ కి ఫెవరెట్ అవునా.. కాదా.. అనేది అర్ధమవుతుంది అంటూ లాజిక్ లు మాట్లాడుతున్నారు. 

Who is Nagarjuna's favorite Bigg Boss contestant?:

Is he Nagarjuna's Favorite Contestant

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ