Advertisementt

అఖిల్ విన్నర్ అవడానికి వేసిన ప్లాన్ ఫ్లాప్!!

Tue 24th Nov 2020 02:02 PM
bigg boss season 4,akhil,monal,big plan,flop show  అఖిల్ విన్నర్ అవడానికి వేసిన ప్లాన్ ఫ్లాప్!!
Bigg Boss: Akhil Plan flop at House అఖిల్ విన్నర్ అవడానికి వేసిన ప్లాన్ ఫ్లాప్!!
Advertisement
Ads by CJ

నిన్నటివరకు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ విషయంలో ఎక్కడో ఏదో డౌట్ ఉండేది. ఎందుకంటే అఖిల్, మెహబూబ్, సోహైల్ ముగ్గురు గట్టి ప్లేయర్స్. అందుకే అఖిల్ కి సోహైల్ కి అండ్ అభిజీత్ కి మధ్యన గట్టి పోటీ ఉందని భావించేవారు. కానీ ఇప్పుడు అఖిల్ మోనాల్ ని అడ్డం పెట్టుకుని బిగ్ బాస్ గేమ్ గెలవాలనుకున్నాడు.మోనాల్ ఎంత చేసినా ఆమెని వదలకుండా అఖిల్ తనని తాను కాపాడుకున్నాడని ఈ వారం బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులకు బాగా అర్ధమైంది. మోనాల్ విషయంలో అభిజిత్ తో గొడవపడి.. లవ్ ట్రాక్ నడిపినట్టుగా మోనాల్ చుట్టూ తిరిగితె మంచి ఫుటేజ్ వస్తుంది అని అఖిల్ నమ్మకం. బయట అదే జరిగింది. బిగ్ బాస్ లో మేజర్ పార్ట్ మోనాల్ - అఖిల్ షో చూడాల్సి వచ్చింది.

అయితే అఖిల్ కేవలం గేమ్ కోసం మోనాల్ ని అడ్డం పెట్టుకున్నాడని విషయం ఈ వారం తేటతెల్లమైంది. బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన అఖిల్ కి విన్నర్ అవుతానని కాన్ఫిడెన్స్ రావడంతో.. మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మోనాల్ ని అవాయిడ్ చెయ్యడం, తల్లి వచ్చాక అఖిల్ మోనాల్ ని దగ్గరకి కూడా రానివ్వకపోవడం, కెప్టెన్సీ టాస్క్ లో హారికాని కెప్టెన్ చేసింది అని మోనాల్ మీద కోపం రావడం అన్ని అఖిల్ గేమ్ ప్లాన్ లా అనిపిస్తుంది. ఇక మిగిలిన మూడు వారాలు మోనాల్ సపోర్ట్ అక్కర్లేదని అఖిల్ ఫిక్స్ అయ్యాడా? అనుకోవచ్చు. ఎందుకంటే మోనాల్ ఎలిమినేట్ అవడం ఖాయంలా కనిపిస్తుంది. టాప్ 5 కి మోనాల్ వెళ్లే ఛాన్స్ లు తక్కువగా ఉండడంతో అఖిల్ మోనాల్ ని అవాయిడ్ చెయ్యడం మొదలెట్టాడు.

ఇక అభిజిత్ మొదటి నుండి హౌస్ లో ఎప్పుడూ ఒకేలా ఉంటూ అందరితో మిత్రుత్వం కానీ శత్రుత్వం కానీ లేకుండా ఉన్నాడు. ఏది చెప్పాలన్నా ఫుల్ క్లారిటీతో ఉండే అభిజిత్ శనివారం ఎపిసోడ్ లో నాగ్ దగ్గర అఖిల్ విషయం ప్రస్తావించిన తీరుకి అందరూ అభిజిత్ ఫాన్స్ అయ్యిపోయారు. మామూలుగానే అభిజిత్ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉన్నా.. ఒక టైం లో గాలి అఖిల్ వైపే వీచింది. కానీ ప్రసుతం సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. సో మోనాల్ ని అడ్డం పెట్టుకుని అఖిల్ విన్ అవుదామనుకుంటే ఇప్పుడా ప్లాన్ బెడిసికొట్టిందనే చెప్పొచ్చు.

Bigg Boss: Akhil Plan flop at House:

Akhil failed to attract the Audience in Bigg Boss House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ