Advertisementt

బిగ్ బాస్ టైటిల్ రేసులో సోహైల్?

Thu 26th Nov 2020 12:18 PM
bigg boss 4,sohail,abhijeet,akhil,monal,nagarjuna  బిగ్ బాస్ టైటిల్ రేసులో సోహైల్?
Sohail in Bigg Boss title race? బిగ్ బాస్ టైటిల్ రేసులో సోహైల్?
Advertisement
Ads by CJ

నిన్నమొన్నటి వరకు బిగ్ బాస్ టైటిల్ రేసులో అఖిల్, అభిజిత్ లు ఉంటారంటూ సోషల్ మీడియాలో జోస్యాలు చెబుతున్నారు. అభిజిత్ క్లీన్ గా క్లాస్ గా టైటిల్ కొట్టడం ఖాయమంటే.. అఖిల్ రఫ్ గాను, మోనాల్ విషయంలో ప్రేమగా, అగ్రెసివ్ గా ఉంటూ టైటిల్ రేసులో ఉన్నాడని అన్నారు. అసలు అప్పుడే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని గూగుల్ లో కొడితే ఒకరి అభిజిత్ పేరు, మరోసారి అఖిల్ పేరు చూపించడంతో.. అఖిల్ లేదా అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్స్ అంటూ అందరూ ఫిక్స్ అవుతుంటే.. కొందరు మాత్రం అభిజిత్ విన్నర్ అంటూ ఫిక్స్ అవుతున్నారు. కేవలం మూడు వారాల గేమ్ ఉన్న హౌస్ లో ఈ వారం అరియనా, మోనాల్, అఖిల్ లలో ఒకరు వెళ్ళిపోతే ఇంకా హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉంటారు.

అందులో ఇప్పడు అభిజిత్, అఖిల్ ని కాదని సోహైల్ టైటిల్ రేసులోకి వచ్చినట్టుగా సోషల్ మీడియా టాక్. లాస్య కూడా వెళుతూ వెళుతూ సోహైల్ - అభిజిత్ లు టాప్ 2 లో ఉంటారని చెప్పినప్పటినుండి సోహైల్ ని బిగ్ బాస్ టైటిల్ రేసులోకి తీసుకొచ్చారు. మొదటి నుండి కాస్త కోపంతో అగ్రెస్సివ్ గా ఉండే సోహైల్ హౌస్ మేట్స్ అందరితో మంచి రిలేషన్ మెయింటింగ్ చేసే సోహైల్ నామినేషన్స్ లోకి కూడా చాలా తక్కువ సార్లు వచ్చాడు. ఇక ఫిజికల్ టాస్క్ లో సోహైల్ పెరఫార్మెన్స్ సూపర్. అందులోను అఖిల్ - అభిజిత్ ల మధ్యన గొడవ కూడా సోహైల్ కి కలిసొచ్చేలా ఉంది అంటున్నారు. హౌస్‌లో జన్యూన్‌గా.. ట్రాన్స్ప్‌రెంట్‌గా తెలంగాణ వాళ్ళకి నచ్చేలా ఉన్న సోహైల్ ని అభిజిత్ నీ మాట తీరు బాలేదు.. నువ్వు క్లాస్ నేను మాస్ అంటూ సోహైల్ కి అభిజిత్ మధ్య గొడవ కూడా సోహైల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి టైటిల్ రేసులోకి వచ్చేలా చేసాయి అంటున్నారు.

Sohail in Bigg Boss title race?:

Bigg boss 4: Sohail to be the title winner?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ