Advertisementt

బిగ్ బాస్ యాజమాన్యంపై చిందులు తొక్కుతున్న నాగ్!

Thu 26th Nov 2020 09:28 PM
bigg boss 4,nagarjuna,bigg boss telugu,team bigg boss  బిగ్ బాస్ యాజమాన్యంపై చిందులు తొక్కుతున్న నాగ్!
Nagarjuna furious over Bigg Boss team!! బిగ్ బాస్ యాజమాన్యంపై చిందులు తొక్కుతున్న నాగ్!
Advertisement
Ads by CJ

తారక్ `బిగ్ బాస్ సీజన్ వన్' హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. సెకండ్ సీజన్ లోను నాని బాగానే హ్యాండిల్ చేసినా కంటెస్టెంట్స్ విషయంలో నాని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యాడు. దానితో సీజన్ త్రీ కి నాని దణ్ణం పెట్టాడు. సీజన్ త్రీ ని సీజన్ 4 ని నాగార్జున సూపర్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. డల్ గా మొదలైన సీజన్ 4 ని నాగార్జున ఒంటి చేత్తో మోస్తున్నాడు. అయితే బిగ్ బాస్ లీకులతో నాగ్ విసిపోయాడట. బిగ్ బాస్ లీకులు మాములుగా లేవు. ఆదివారం ఏ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారో అనే విషయం శనివారం లీకవడం, అలాగే హౌస్లో జరిగే విషయాలతోను నాగ్ కి కోపం తెప్పించిందని.. బిగ్ బాస్ యాజమాన్యంపై నాగ్ ఫైర్ కూడా అయ్యాడనే టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 ముగుస్తున్న బిగ్ బాస్ లీకులు ఆగడం లేదని.. ఈ విషయంలో నాగ్ చాలా చిరాకుగా ఉన్నాడని అంటున్నారు.

ఒకవేళ సీజన్ చివరి వరకు ఇదే కంటిన్యూ.. అయితే ఈ లీకుల పర్వం ఇలానే సాగితే నెస్ట్ సీజన్ కి తాను హోస్ట్ చెయ్యనని మోహమాటం లేకుండా నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ ని సీక్రెట్ గా ఉంచాల్సింది పోయి.. ఇలా లీకులు వదిలితే షో మీద ఏం క్రేజ్ ఉంటుంది.. నేను ఇంతా కష్టపడి షో ని లేపాలని ట్రై చేసినా ఉపయోగం ఉండదు.. అంటూ బిగ్ బాస్ యాజమాన్యంపై నాగార్జున ఫైర్ అవుతున్నాడట. ఇప్పటికైనా బిగ్ బాస్ యాజమాన్యం సీరియస్ గా ఉంటేనే కానీ.. లేదంటే కష్టమని చెప్పేశాడట నాగ్. మరి నాగార్జున కోసం చార్టెడ్ ఫ్లైట్ ఆరెంజ్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం ఈ లీకులను ఆపలేకపోతుంది అంటే నవ్వొస్తుంది అంటున్నారు నెటిజెన్స్. 

Nagarjuna furious over Bigg Boss team!!:

Nag Warns the Bigg boss team for this reason

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ