తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడినప్పుడు.. కేసీఆర్ తన వాక్చాతుర్యంతో తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో ఉత్సహాన్ని నింపి మంచి స్థానం సంపాదించుకున్నట్టుగా ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ భారీ బహిరంగ సభల్లో మట్లాడుతూ.. హైదరాబాద్ కి ఉద్యోగం చేసుకోవడానికి వస్తున్న తమ్ముళ్ళకి హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అంటూ హైదరాబాద్ ఐటీ హబ్ గా మారింది.. ఇక్కడ డెవెలప్ చేసేది టీఆరెస్ ప్రభుత్వమే అంటూ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ప్రజలతో మమేకమై ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడు.
ఇక ఆ సభలో కేటీఆర్ భారీ డైలాగ్స్ తో చప్పట్లు కొట్టించుకున్నాడు. సింహం సింగిల్ గా వస్తుంది.. కేసీఆర్ సింగిల్ గానే వస్తాడు, ఏమి గుంపులుగా వచ్చేయో మీకే తెలుసు అంటూ ప్రజలతో (కాంగ్రెస్, బిజెపి వాళ్ళని పందులుతో పోలుస్తూ) అనిపించాడు. కేసు అయితే మీ మీదే పడుతుంది అంటూ ప్రజలనుద్దేశించి కామెడీ చేసాడు కేటీఆర్. పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెడుతున్నారు.. ఆ చిచ్చులో మంట పెట్టాలని చూస్తున్నారు. ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి.. అంటూ మాటలు తూటాల్లా పేలుస్తున్నాడు.
వ్యాక్సిన్ తయారీ హబ్ గా హైదరాబాద్ మారుతుంది అని, తల్లికి కూడు పెట్టని వాళ్ళు పిన్నమ్మకి వడ్డాణం చేయిస్తా అన్నారట, ఆడబిడ్డలందరికి లక్ష డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హమి ఇచ్చిన కేసీఆర్.. అది నెరవేరుస్తాడు. ఇక ఈ ప్రచారంలో కేటీఆర్ ప్రధాని మోడీని వదల్లేదు. రెండు రోజులో మోడీ వస్తాడట.. ఇదేమన్నా ఇది హైదరాబాద్ ఎలెక్షనా.. లేదంటే పార్లమెంట్ ఎలెక్షనా. ఇంకా అవసరమైతే ట్రంప్ కూడా వస్తాడు.. ఎందుకంటే ఖాళీగా ఉన్నది ఆయనే అంటూ మోదీకి చురకలంటించారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ 'లోకల్ ఫర్ లోకల్' తెలంగాణాలో 'పక్కా లోకల్' పార్టీ ఎవరిదో మీరే ఆలోచించుకోండి. 'గల్లీ పార్టీ కావాలా లొల్లి లొల్లి చేసే ఢిల్లీ పార్టీలు కావాలా'.. అంటూ కేటీఆర్ అదిరిపోయే డైలాగ్స్ తో రెచ్చిపోయాడు.