పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకి వెళ్లబోతుంది. ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రకరణ జరుపుకున్న ఫైటర్ చిత్రం కరోనా కారణంగా ఏడు నెలల పాటు నిరవధికంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో విజయ్ తండ్రి పోషించబోయే నటుడు పేరు ఇదే అంటూ అప్పట్లో ఏవేవో పేర్లు తెర మీదకి వచ్చినా.. తాజాగా విజయ్ తండ్రి పాత్రకి సీనియర్ నటుడు సురేష్ గోపిని ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సురేష్ గోపి ఆటే మలయాళం సీనియర్ హీరో అన్నమాట. సురేష్ గోపి తెలుగు ప్రేక్షకులు సుపరిచుతుడే. ఆయన నడిచిన చాలా సినిమాలు తెలుగులో డబ్ కూడా అయ్యాయి.
అలాంటి సీనియర్ నటుడిని విజయ్ దేవరకొండ ఫాదర్ గా పూరి ఎంపిక చెసుకోవడంతో సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం అంటున్నారు. ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రి డాన్ పాత్రలో కనిపిస్తాడని టాక్ ఉంది. ఇక సినిమాలో కొడుకు - తండ్రి సెంటిమెంట్ హైలెట్ అవుతుంది అని.. డాన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అని.. అందుకే ఆ పాత్రకోసం సురేష్ గోపిని పూరి సంప్రదించాడని.. పాత్ర వెయిట్ ని బట్టి సురేష్ గోపి కూడా ఒప్పుకోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ కి తల్లిగా రమ్యకృష్ణ కనిపించనుంది. పూరి - విజయ్ సినిమా టైటిల్ కూడా షూటింగ్ మొదలయిన తరువాత ఓ మంచి రోజు చూసుకుని ప్రకటిస్తారని ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి తెలిపారు.