రాహుల్ సింప్లి గంజ్ - పునర్నవి బిగ్ బాస్ సీజన్ 3 హౌస్ లో చేసిన రొమాన్స్ చూసిన ఎవ్వరైనా ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే అంటారు. అయితే బిగ్ బాస్ లో రొమాన్స్ పండించిన ఈ జంట బయటికి వచ్చి ఎవరికీ వారే తమ కెరీర్ లో బిజీ అయ్యారు. పునర్నని సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీ అయితే.. రాహుల్ బిగ్ బాస్ విన్నర్ గా పలు సినిమాలకు పాటలు పాడేందుకు, అలాగే నటుడుగాను రాహుల్ బిజీ అయ్యాడు. అయితే రాహుల్ - పునర్నవీలు కెరీర్ లో బిజీ అయినా వీరి ప్రేమ పై అనేకరకాల వార్తలు, పెళ్లి అంటూ గాసిప్స్ మాత్రం సోషల్ మీడియాని వదల్లేదు. లేటెస్ట్ గా పునర్నవి.. వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తనకి ఎంగేజ్మెంట్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ వెంటనే రాహుల్ సిప్లిగంజ్ కూడా హార్ట్ బ్రేక్ అయినట్టు పోస్ట్ పెట్టడంతో.. పునర్నవి పెళ్లి చేసుకోబోతుంది.. అందుకే రాహుల్ హార్ట్ బ్రేక్ అయినట్లుగా పోస్ట్ పెట్టాడు.. అంటూ వాళ్ల ప్రేమపై రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి.
అయితే తాజాగా రాహుల్ ఆ హార్ట్ బ్రేక్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చాడు. అది రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ప్రవేట్ ఆల్బమ్స్ చేసుకుంటున్నాడు. అందులో భారీ బడ్జెట్ పెట్టి..ఓ బేబీ అనే ప్రవేట్ ఆల్బమ్ లో సాంగ్ చిత్రీకరణ చేసాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో 58 లక్షల ఖర్చుతో ఓ బేబీ సాంగ్ చిత్రీకణ చెయ్యగా దానికి పూర్ రెస్పాన్స్ రావడంతో.. బడ్జెట్ పరంగా నష్టపోయిన రాహుల్ కి హార్ట్ బ్రేక్ అయ్యిందట. 36 లక్షలు దగ్గర ఆ సాంగ్ చేయలేమని నిర్మాతలు చేతులు ఎత్తెయ్యగా మిగతా డబ్బు రాహుల్ పెట్టుకుని ఆ సాంగ్ పూర్తి చెయ్యగా.. దానికొచ్చిన రెస్పాన్స్ చూసి, తానెంత నష్టపోయానో అంటూ తన హార్ట్ బ్రేకవడంతోనే ఆ పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టగా అదే టైం కి పునర్నవి తన ఎంగేజ్మెంట్ విషయం చెప్పడం యాదృచ్ఛికం అని.. తాను ఓ బేబీ తో నష్టపోయిన విషయం చెబితే మీరింకేదో అంటుకున్నారంటూ ఆ హార్ట్ బ్రేక్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చాడు.