పవన్ కళ్యాణ్ ని ఎమన్నా అన్నా, మెగా ఫ్యామిలీని కెలికినా, చిరుని విమర్శించినా ముందుగా ఆ మెగా కాంపౌండ్ నుండి ఫైర్ అయ్యేది నాగబాబే. తాజాగా పవన్ కళ్యాణ్ ని రాజకీయ ఊసరవెల్లి అంటూ ప్రకాష్ రాజ్ విమర్శించడంపై ఇప్పుడు నాగబాబు ప్రకాష్ రాజ్ పై చిందులు తొక్కుతున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి ముందు ఏదో పొడిచేస్తా అంటూ బయలుదేరి చివరికి బిజెపితో చేతులు కలపడం అనేది చూస్తూనే ఉన్నాం. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ అంటూ షాకిచ్చి.. ఆ షాక్ నుండితేరుకోకముందే బిజెపికి మద్దతు ప్రకటించడంపై నటుడు, రాజకీయనాయకుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఊసరవెల్లి అంటూ బాణాలు సంధించాడు.
దానితో ఎప్పటిలాగే నాగబాబు లైన్ లోకొచ్చాడు. రాజకీయాలంటే ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుతుంటాయి. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాల్లో అనేకం చెయ్యాల్సి వస్తుంది. దాని కోసం పవన్ ని విమర్శించే అవసరం ఎంతమాత్రం లేదు. జనసేన బిజెపికి మద్దతివ్వడం వెనక చాలా ప్రజా పయోజనాలున్నాయి.. అంటూ రాజకీయ విషయాలనే కాకుండా ప్రకాష్ రాజ్ కెరీర్ కి సంబందించిన విషయాలతోను నాగబాబు ప్రకాష్ రాజ్ పరువు తీసాడు.
ప్రకాష్ రాజ్ పారితోషకాల కోసం నిర్మాతలను వేపుకు తింటాడంటూ ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. ప్రకాష్ రాజ్ నిర్మాతలను డబ్బు కోసం హింసించే మనిషి అని, తనకి నచ్చక పొతే ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసి నిర్మాతలను తిప్పలు పెడుతుంటాడని... ముందు నువ్వు సక్రమంగా ఉండు.. తర్వాత వేరే వాళ్ళని విమర్శిద్దువు గాని అంటూ ప్రకాష్ రాజ్ పరువు తీసేసాడు నాగబాబు.