బిగ్ బాస్ సీజన్ 4 లో శనివారం ఎపిసోడ్ కి నాగార్జున వస్తున్నాడు అంటే ఆ రోజు హౌస్ లో ఎవరికో అంక్షింతలు ఖాయం.. నాగార్జున చేతిలో క్లాస్ పీకించుకోవడానికి తప్పు చేసిన హౌస్ మేట్స్ అందరూ రెడీ అవ్వాల్సిందే. తప్పు చేసిన వారిని నాగ్ తన క్లాస్ తో పనిష్మెంట్స్ ఇస్తుంటాడు. ఒక్కోసారి హౌస్ మేట్స్ మీద నాగ్ కి కోపం కూడా వస్తుంది. తాజాగా ఎప్పుడూ వెనకేసుకొచ్చే అభిజిత్ మీద నాగార్జునకి కోపం వచ్చింది. ప్రతివారం అభిజిత్ విషయంలో కోప్పడే నాగార్జున ఈసారి బాగా సీరియస్ అయ్యాడు. హారికాని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అభిజిత్ టాస్క్ చెయ్యకపోతే కెప్టెన్ గా నువ్వు చేయించాలి కదా అని అడిగితే.. దానికి హారిక, అభిజిత్ పర్సనల్ గా తీసుకున్నాడని చెప్పడంతో నాగ్ అభిజిత్ పై ఫైర్ అయ్యాడు.
కానీ అభిజిత్ నేనూ అఖిల్ మోనాల్ ని ఏడిపించామని బిగ్ బాస్ చెప్పడం నాకు నచ్చలేదు అనగానే.. అవునా అంటూ నాగార్జున ఓ వీడియో ప్లే చేసి అభిజిత్ కి చూపించాడు. దానిలో మోనాల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు,, అభిజిత్ మోనాల్ ని ఏడిపించడం ఉంటుంది. దానితో నాగ్ నువ్వు మోనాల్ ఏడిపించిన విషయం తెలిసే బిగ్ బాస్ నీకు ఆ పనిష్మెంట్ ఇచ్చాడు అనగానే.. వెంటనే అభిజిత్ నాగ్ తో సారి అంటూ చెప్పినా.. నాగ్ సీరియస్ అవుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఇలా సారి చెబుతావ్ అభిజిత్ ప్రతి వారం ఇదే జరుగుతుంది అంటూ అభిజిత్ ని నెగటివ్ చెయ్యడమే కాదు... అభిజిత్ ని బయటికి వెళ్ళమన్నట్టుగా నాగార్జున బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అనడంతో అభి నాగార్జునకి సారి చెబుతూ షాకవడం, అక్కడే ఉన్న ఇంటి సభ్యులు కూడా అవాక్కయ్యారు. మరి అభిని బిగ్ బాస్ హౌస్ బయటికి పంపారా.. లేదా.. అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.