రష్మిక - పూజ హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్. వీరిద్దరి మద్యన హెల్దీ కాంపిటీషన్ నడుస్తుంది. సినిమాల విషయంలోనూ, స్టార్ హీరోల విషయంలోనూ, పారితోషకాల విషయంలోనూ రష్మిక - పూజ హెగ్డే లు పోటాపోటీగా ఉన్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ చేస్తుంటే... శర్వానంద్ తో ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా చేస్తుంటే... పూజ హెగ్డే ప్రభాస్ తో రాధేశ్యాం పాన్ ఇండియా మూవీ తో పాటుగా, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరో సినిమాల్లో నటిస్తుంది.
అయితే పూజ హెగ్డే బాలీవుడ్ లో కూడా బిజిగా మారింది. తాజాగా పూజ హెగ్డే - రష్మిక కలసి ఒకే సినిమాలో నటించబోతున్నారని టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపించింది. అది కూడా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో రష్మిక - పూజ హెగ్డే లు కలిసి నటించబోతున్నానే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. పడి పడి లేచే మనసు ప్లాప్ తో హనుని స్టార్ హీరోస్ ఎవరు దగ్గరకి రానివ్వకపోయినా.. హను మలయాళ హీరో దుల్కర్ ని సెట్ చేసుకున్నాడు. మరి దుల్కర్ సల్మాన్ తో గ్లామర్ గర్ల్స్, కాపిటిషన్ గర్ల్స్, క్రేజ్ ఉన్న హీరోయిన్స్ రష్మిక - పూజ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అందులోను దుల్కర్ హీరో.. ఇక యూత్ లో ఆ సినిమాపై అంచనాలే అంచనాలన్నమాట.