Advertisementt

అవినాష్ మోసం.. అరియనా ఏడుపు..!

Thu 03rd Dec 2020 10:16 AM
bigg boss 4,bigg boss telugu,nagarjuna,avinash,ariyana,harika,akhil,abhijeet  అవినాష్ మోసం..  అరియనా ఏడుపు..!
Bigg Boss 4: Avinash cheating.. Ariana crying..! అవినాష్ మోసం.. అరియనా ఏడుపు..!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 చివరి రెండు వారలు కంటెస్టెంట్స్ మధ్యన ఆసక్తికర ఆట మొదలయ్యింది. టికెట్ టు ఫినాలే కోసం అరియనా, అవినాష్, మోనాల్, అఖిల్, అభిజిత్, సోహైల్, హరికలు గట్టిగానే పోటీ పడ్డారు. అయితే అందులో అవినాష్ ముందే ఎలిమినేట్ అయ్యాడు. దానితో తనని ఎవరూ గేమ్ ఆడనివ్వడం లేదంటూ సింపతీ స్టార్ట్ చేసాడు. అందరూ కలిసికట్టుగా గేమ్ ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యాడు. ఇక అవినాష్ అయితే ఎలాగైనా గెలవాలని మోసం కూడా చేద్దామనుకున్నాడు. అంటే పాలలో నీళ్లు కలపడం, ఎవరూ చూడకుండా ఇంట్లోని పాలు కలిపెయ్యడంతో బిగ్ బాస్ అవినాష్ ని ఈ టాస్క్ నుండి తప్పించాడు. మోసం చేసైనా.. గెలవాలన్న అవినాష్ కి బిగ్ బాస్ ఝలక్ ఇచ్చాడు. ఇక పాల బాటిల్ తక్కువ ఉన్న కారణంగా అరియానని ఈ టాస్క్ నుండి బయటికి పంపేశాడు బిగ్ బాస్.

దానితో అరియనా ఏడుపు స్టార్ట్ చేసింది. నేను ఎలాగైనా ఫైనల్స్ కి వెళ్ళాలి, టాప్ 5 లో ఉండాలి అంటూ ఏడవడంతో అవినాష్ అరియానని ఓదార్చే ప్రయత్నం చేసాడు. నువ్వు వెళ్తావ్, నువ్వు గెలుస్తావ్ అంటూ అరియనాకి ఓదార్పు యాత్ర చేసాడు. ఇక తర్వాత మోనాల్ కూడా ఈ గేమ్ నుండి బయటికి రాగా.. ఈ టికెట్ ఫినాలే లో సెకండ్ రౌండ్ లోకి హారిక, అభిజిత్, అఖిల్ అండ్ సోహైల్ లు వెళ్లారు. మరి ఆ టికెట్ టు ఫినాలే కార్డు ఎవరికీ దక్కుతుందో.. అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. కాకపోతే ఆ కార్డు కోసం హారిక - సోహైల్ లు గట్టిగానే గొడవపడుతున్నారు. అదేమిటో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Bigg Boss 4: Avinash cheating.. Ariana crying..!:

Bigg boss 4: Ticket to Finale task 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ