Advertisementt

సినిమాల కోసం పవన్ కష్టాలు!

Thu 03rd Dec 2020 01:06 PM
pawan kalyan,movies,liquid diet,vakeel saab  సినిమాల కోసం పవన్ కష్టాలు!
Pawan struggles for movies! సినిమాల కోసం పవన్ కష్టాలు!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వరస సినిమాల కమిట్మెంట్స్ తో దర్శకనిర్మతలకు ఊపిరాడనివ్వడం లేదు. రాజకీయాలతో పాటుగా సినిమాలు చేస్తా.. అన్న పవన్ తో సినిమాలు చేసే దర్శకుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఐదు సినిమాలు చేతిలో ఉన్న పవన్ కళ్యాణ్ కోసం మరో దర్శకుడు కూడా సినిమా చెయ్యాలనే కసితో ఉన్నాడట. అయితే రాజకీయాలతో పవన్ కళ్యాణ్ బరువు పెరిగి కాస్త లావుగా తయారయ్యాడు. కానీ సినిమాల విషయానికొచ్చేసరికి పవన్ కళ్యాణ్ సన్నబడాల్సి ఉంది. మరోపక్క సోషల్ మీడియాలో పవన్ బరువు పెరగడంపై కామెంట్స్ పడుతున్నాయి. కానీ పవన్ కి రాజకీయాలు, సినిమాలు, పూజలు అంటూ బిజీ షెడ్యూల్. దానితో పవన్ జిమ్ చెయ్యలేక, బరువు తగ్గించేందుకు వేరే విధానం ఎంచుకున్నాడట.

అది పవన్ కళ్యాణ్ బరువు తగ్గేందుకు కేవలం లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నాడట. పింక్ రీమేక్ వకీల్ సాబ్ లాయర్ లుక్ కోసం పవన్ ఎలాంటి డైట్, జిమ్ చెయ్యకపోయినా..  ఆ లాయర్ లుక్ కి ఓకె కానీ, క్రిష్ అండ్ హరీష్ శంకర్ మూవీస్ కోసం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సన్నబడాలి కాబట్టే.. ఇలాంటి డైట్ ఫాలో అవుతున్నట్టుగా చెబుతున్నప్పటికీ.. వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ బరువు తగ్గి స్లిమ్ లుక్ లో కనబడాల్సి ఉన్న కారణంగానే పవన్ ఇలాంటి లిక్విడ్ డైట్ ఫాలో వుతున్నట్టుగా ప్రచారం  జరుగుతుంది. ఈ లిక్విడ్ డైట్ లో భాగంగా ఎక్కువగా ద్రవ పదార్థాలతో కూడిన ఆహారాన్నే పవన్ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. 

Pawan struggles for movies!:

Pawan Kalyan takes up Liquid diet for weight loss

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ