బిగ్ బాస్ కి వెళ్లేముందు అబ్బో.. మాకు క్రేజ్ వచ్చేస్తుంది. పారితోషకం రూపంలో బోలెడంత డబ్బులొచ్చేస్తాయి.. బిగ్ బాస్ క్రేజ్ తో సినిమా అవకాశాలు క్యూ కడతాయి అంటూ చాలామంది చాలా క్యూరియాసిటీతో బిగ్ బాస్ కి వెళతారు. అక్కడికి వెళ్ళాక కానీ తెలియదు బిగ్ బాస్ గేమ్. హౌస్ లో నిద్ర ఉండదు, ఫుడ్ సరిపడా ఉండదు... బిగ్ బాస్ కి పనికొచ్చే ఫుటేజ్ ప్రేక్షకులకి ఇస్తాడు కానీ.. కంటెస్టెంట్స్ కోరుకున్న ఫుటేజ్ రాదు. ఇది షో నుండి బయటకొచ్చిన వాళ్ళు చెప్పే మాటలు. ఇక నోయెల్ అయితే బిగ్ బాస్ అంత వేస్ట్ షో మరొకటి లేదంటున్నాడు. ఆరోగ్యం బాగోక బిగ్ బాస్ నుండి బయట పడిన నోయెల్.. బయటికొచ్చాక కాని బిగ్ బాస్ షో ఏమిటి అనేది అర్ధం కాలేదు.
ఊరికి దూరంగా ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యి కనీసం ఛానల్స్ కి దొరక్కుండా సైలెంట్ ని మెయింటింగ్ చేస్తున్నాడు నోయెల్. కానీ హరిక బ్రదర్ ఊరుకోకుండా నోయెల్ దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చేసాడు. ఇష్టపడే మనుషలకీ దూరంగా ఉండాలనే సిటీకి దూరంగా ఏడాది క్రితం కొన్న ఇంటికి షిఫ్ట్ అయ్యా అని.. ఇక బిగ్ బాస్ షో మనకి అవసరం లేదంటున్నాడు నోయెల్. తనకి బిగ్ బాస్ వలన ఏం డ్యామేజ్ అయ్యిందో చెప్పకుండా.. తాను ఆ షో కి ఎందుకు వెళ్లానో అని ఇప్పుడు ఫీలవుతున్నట్టుగా చెప్పి షాకిచ్చాడు నోయెల్. అందుకే బయటికి వచ్చాక బిగ్ బాస్ చూడడమే మానేశా అంటూ చెప్పి ఇంకా పెద్ద షాకిచ్చాడు.
ముందే చెప్పాడు.. నేను బిగ్ బాస్ హౌస్ లోనే ఉండి.. అన్ని టాస్క్ ల్లో పార్టిసిపేట్ చేశా.. కానీ ఆ ఫుటేజ్ బిగ్ బాస్ ఇవ్వలేదు.. నేనేమన్నా బాత్ రూమ్ లో దాక్కున్నానా అని. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షో మనకొద్దు అంటూ షో పాపులారిటీని డ్యామేజ్ చేసేసాడు నోయెల్. మరి ఇకపై బిగ్ బాస్ కి వెళ్లాలనుకునే వారు నోయెల్ తాజా ఇంటర్వ్యూ చూస్తే ఇక వెళ్లే సాహసం చేయరేమో అనిపిస్తుంది.