నాగ శౌర్య స్పీడు మాములుగా లేదు. అశ్వద్ధామ తర్వాత పవర్ ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్స్ తో సినిమాలు చేస్తున్న నాగ శౌర్య 'లక్ష్య, వరుడు కావలెను' సినిమాలతో పాటుగా అనీష్ కృష్ణ దర్శకత్వంలోని మరో సినిమాని అధికారికంగా ప్రకటించాడు. లక్ష్య సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ తో ఫుల్ మేకోవర్ అయిన నాగ శౌర్య.. అనీష్ కృష్ణ సినిమాలో శ్రీ కృష్ణుడిగా కనిపించబోతున్నాడట. అంటే ఈ సినిమా ఏ మహాభారతమో అంటూ చారిత్రత్మకం కాకుండా కమర్షియల్ మూవీనే. కానీ సినిమాకి టైటిల్ గా 'శ్రీకృష్ణ - సత్యభామ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్.
ఈ సినిమాలో నాగ శౌర్య పాత్ర శ్రీకృష్ణుడిని పోలి ఉంటుంది అనగానే మరి గోపికలు ఎవరు శౌర్య అంటూ కౌంటర్లు పడుతున్నాయి. ఈ సినిమాలో శౌర్య సరసన హీరోయిన్ గా షర్లీ సేతియా నటిస్తుంది. మరి ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉంటుందో లేదో తెలియదు కానీ.. ఉన్న హీరోయిన్ పాత్ర మాత్రం పవర్ ఫుల్ సత్యభామ ని పోలి ఉంటుంది అని.. అందుకే 'శ్రీకృష్ణ - సత్యభామ' టైటిల్ అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సూటవుతుంది అని అనుకుంటున్నారట. మరి నాగ శౌర్య ఈ సినిమాలో శ్రీకృష్ణ తాండవం కూడా చేస్తాడేమో అనే కామెంట్స్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి.