శనివారం నాగార్జున వస్తాడు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకుతాడు .. ఎప్పుడు నాగ్ కి ఏ కంటెస్టెంట్ దొరుకుతాడో అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్టుగానే.. ఈ వారం కూడా నాగార్జున క్లాస్ షురూ అయ్యింది. ఈ వారం అంతా మంచిగానే జరిగినా.. అఖిల్ కోసం సోహైల్ త్యాగాన్ని నాగార్జున ఒప్పుకోలేదు. 22 గంటలు ఓపిగ్గా కూర్చున్న నువ్వు ఎందుకు ముందుగానే ఉయ్యాల దిగేశావ్ అంటూ సోహైల్ కి క్లాస్ పీకాడు నాగార్జున. ఇక సోహైల్ తో పాటుగా అవినాష్ కూడా నాగ్ చేతికి దొరికిపోయాడు.
టికెట్ టు ఫినాలే టాస్క్ లో అవినాష్ తనని మోనాల్ తన్నింది అంటూ గొడవ గొడవ చేసి ఆటని ఆపేసాడు. టికెట్ టు ఫినాలే నుండి అవినాష్ వైదొలిగినా ఆ విషయం ఒప్పుకోలేదు. మోనాల్ తన్నింది అంటూ సోహైల్, అభిజిత్ దగ్గర పంచాయితీ కూడా పెట్టాడు. ఇప్పుడు అదే విషయాన్ని నాగార్జున అవినాష్ ని అడిగితె.. అవును తన్నింది.. కావాలనే తన్నిందా అని నాగ్ అడగగా.. అవును 100%, 200% తన్నింది. ఆమె తన్నాక కూడా ఫేస్ ఎక్సప్రెషన్స్ అదోలా పెట్టింది అనగానే.. నాగార్జున సీరియస్ గా మోనాల్ అవినాష్ ని తన్నింది అంటున్న వీడియో ప్లే చెయ్యమని చెప్పాడు.. దానితో హౌస్ మొత్తం డల్ అయ్యింది. సో ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కాస్త హాట్ గానే అనిపిస్తుంది.