రాజమౌళి RRR లో అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ కోసం హీరోయిన్ గా బాలీవుడ్ భామ అలియా భట్ అయితే పర్ఫెక్ట్ అని సీత పాత్రకి అలియా భట్ ని ఎంపిక చెయ్యడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఎప్పుడెప్పుడు అలియా భట్ RRR సెట్స్ లో అడుగుపెడుతుందో అని ఎదురు చూస్తున్నారు అంతా. కానీ కరోనా తో అలియా భట్ రాక ఆలస్యం అయ్యింది. మధ్యలో అలియా భట్ పై నెటిజెన్స్ ట్రోలింగ్. అంత ట్రోలింగ్స్ ని, నెటిజెన్స్ హెట్నెస్ ని భరించలేకపోయా.. అంతగా ట్రోలింగ్ తో నన్ను బాధపెట్టారంటూ ఈమధ్యనే అలియా భట్ తనపై వస్తున్న ట్రోలింగ్ విషయంలో స్పందించింది. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణంతో నెటిజెన్స్ , సుశాంత్ అభిమానులు స్టార్స్ కిడ్స్ పై పడ్డారు. అలా అలియా భట్ ఇరుక్కుంది.
దానితో అలియా భట్ RRR లో కరెక్ట్ కాదేమో అన్నారు. కానీ రాజమౌళి ఆ విషయాలతో మనకి పని లేదూ.. ఆలియా భట్ RRR లో ఉంటుంది అని మాటిచ్చేసాడు. అయితే ఈమధ్యనే 50 రోజుల లాంగ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది RRR టీం. అసలు మధ్యలోనే అలియా భట్ RRR సెట్స్ మీదకి రావాల్సి ఉంది.. కానీ తాజాగా మహాభలేశ్వరంలో జరుగుతున్న RRR సెట్స్ లోకి అలియా భట్ అడుగుపెట్టింది. అక్కడే RRR షూటింగ్ లో అలియా హడావిడి మొదలైంది. అయితే RRR లో ఆయా భట్ ఓ 15 నిమిషాల కేరెక్టర్ మాత్రమే చేస్తుందట. అందుకే.. డేట్స్ విషయంలో అలియాకి ప్రోబ్లెంస్ లేవంటున్నారు.