Advertisementt

ఉదయపూర్ పయనమైన నిహారిక - చైతన్య!

Tue 08th Dec 2020 11:56 AM
niharika nagababu,varun tej,chaitanya,niharika wedding,udaipur,rajasthan  ఉదయపూర్ పయనమైన నిహారిక - చైతన్య!
Niharika and her family leaving to Udaipur ఉదయపూర్ పయనమైన నిహారిక - చైతన్య!
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అన్ని రాజస్థాన్ ఉదయపూర్ లోనే జరుగుతున్నాయని అందరూ ఫిక్సయ్యారు . ఎందుకంటే నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదయ్ ప్యాలెస్ లో జరగబోతుంది కాబట్టి.. అందుకే నిహారిక ఎప్పుడో ఉదయ్ పూర్ వెళ్ళిపోయింది అని అనుకున్నారు. కానీ తాజాగా నిహారిక - కాబోయే భర్త చైతన్య వడ్లమూడి, అన్న వరుణ్ తేజ్, డాడ్ నాగబాబు, తల్లి పద్మజ, నిహారిక కాబోయే అత్తమామలు అందరూ కలిసి స్పెషల్ ఫ్లైట్ లో రాజస్థాన్ ఉదయ్ పూర్ కి పయనమయ్యారు. తాము ఉదయ్ పూర్ కి వెళుతున్నట్టుగా నిహారిక ఓ పిక్ షేర్ చేసింది. 

నిన్నటివరకు నాగబాబు ఇంట్లోనే నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరిగాయి. నిహారిక మంగళ స్నానం, నిన్న పెళ్లి కూతురు ఫంక్షన్ అన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఇక నిహారిక పెళ్లి కూతురు ఫంక్షన్ కి చిరంజీవి భార్య సురేఖ సమేతంగా హాజరై నిహారికాని ఆశీర్వదించారు. నిహారిక తన తండ్రిని నాన్న అని చిరు ని డాడ్ ని పిలుస్తుంటుంది. మరి ఇష్టమైన కూతురు పెళ్లి కూతురు అవుతుంటే చిరు ఊరుకుంటాడా.. బోలెడన్ని కానుకలతో నిహారికాని సర్ప్రైజ్ చేసాడు. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక నాగబాబు కి క్లోజ్ అయినా జబర్దస్త్ టీమ్ లోని గెటప్ శ్రీను నిహారిక పెళ్లి కూతురు ఫంక్షన్ కి హాజరయ్యాడు. మరి డిసెంబర్ 9 న నిహారిక - చైతన్య పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఈ నెల 11  న హైదరాబాద్ లోని హెచ్ ఆర్ సి లో నిహారిక - చైతన్య ల రిసెప్షన్ ని పెళ్లి కొడుకు తండ్రి - నాగబాబు కలిసి గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.

Niharika and her family leaving to Udaipur:

Niharika family and Chaitanya family leaving to Udaipur, Rajasthan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ