మెగా ఫ్యామిలి పెళ్లి అంటే మాములు విషయం కాదండోయ్.. అది ఏ సెలెబ్రిటీ ఇంట జరగని రేంజ్ లో జరుగుతుంది. చిరు రెండో కూతురు శ్రీజ రెండో పెళ్లి అందరి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా అంగరంగ వైభవంగా చేసాడు చిరంజీవి. మరి చిరుకి ఇష్టమైన తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఏర్పాట్లు చూస్తే కళ్ళు జిగేల్ మానడం ఖాయం. ఆ రేంజ్ లో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిహారిక పెళ్లి ఏర్పట్లు జరుగుతున్నాయి. నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా ఫ్యామిలీ ఇప్పటికే రాజస్థాన్ చేరుకుంది. మొదటగా పెళ్లి కూతురు నిహారికతో పాటుగా నాగబాబు ఫ్యామిలీ, పెళ్లి కొడుకు చైతన్య ఫ్యామిలీస్ ప్రత్యేకించి ప్రవేట్ జెట్ లో రాజస్థాన్ కి వెళ్లారు. నిహారిక - చైతన్య రొమాంటిక్ ఫ్లైట్ ఫోజులు అందరిని ఆకట్టుకున్నాయి. మరి నిహారిక ఫ్యామిలీ అక్కడ రాజస్థాన్ లో ల్యాండ్ అయ్యిందో.. లేదో.. ఇక్కడ అల్లు ఫ్యామిలీ అంటే అల్లు అరవింద్ మరియు భార్య, అల్లు అర్జున్, స్నేహ, అర్హ, అయాన్ లు ప్రవేట్ ఫ్లైట్ ఎక్కారు. అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ ఫ్లైట్ జర్నీ ఫొటోస్ సాంఘీక మద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీ అక్కడ రాజస్థాన్ లో ఫ్లైట్ దిగిందో లేదో.. చిరు అండ్ ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్ లో స్పెషల్ ఫ్లైట్ ఎక్కింది. చిరు భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలు స్పెషల్ ఫ్లైట్ లో రాజస్థాన్ కి చేరుకున్నారు. రామ్ చరణ్ చిట్టి చెల్లాయ్ పెళ్ళికి రెండు రోజులు ముందుగానే ఫ్లైట్ ఎక్కేసాడు. ఇక చిరంజీవి కూడా నిహారికకు కోట్లు పెట్టి బంగారు ఆభరణాల బహుమతులు అందచేసాడట. మరోపక్క అల్లు ఫ్యామిలీ, అలాగే కుర్ర హీరోలు సాయి ధరమ్ తేజ్ బ్యాచ్ కుడా పెళ్లి కూతురు నిహారికకు బోలెడన్ని కానుకలు ఇచ్చారట. ఇక ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చార్టెడ్ ఫ్లైట్స్ లో మెగా సందడి గురించే మాట్లాడుకుంటున్నారు.