మెగా ఫ్యామిలి పెళ్లి అంటే.. ఫ్యామిలీ మొత్తం పెళ్ళికి హాజరై హడావుడి చేస్తుంటారు. నాగబాబు కూతురు నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ రేపు రాత్రి జరగబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మెంబెర్స్ చిరంజీవి ఫ్యామిలీ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ పిల్లలు, అరవింద్ ఫ్యామిలీ, అల్లు శిరీష్, బాబీ ఫ్యామిలీ, సాయి ధరమ్ ఫ్యామిలీ అంతా రాజస్థాన్ కి వచ్చెయ్యడమే కాదు.. నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. నిన్న డిసెంబర్ 7 న మెగా ఫ్యామిలీ మొత్తం ఎవరికి వారే స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని రాజస్థాన్ కి వెళ్లారు.
అయితే అన్న కూతురు నిశ్చితార్థంలో కనబడని పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్ళికి రాజస్థాన్ ఎప్పుడు వెళతాడు. రైతుల కోసం దీక్ష చెయ్యాల్సిన అవసరం లేకపోయినా... నివారు వరదలకు కొట్టుకుపోయిన పొలాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నాడు. ఈ రోజు రైతులంతా భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. కానీ బిజెపికి మద్దతునిచ్చే పవన్ కి భరత్ బంద్ కి మద్దతివ్వాల్సిన అవసరం లేదు. మరి రాజకీయాలతో హడావిడి చేసే పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్ళికి ఎప్పుడు వెళ్తాడు.. తన మూడో భార్య కొడుకుతో పవన్ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాడా అని.. మెగా ఫ్యామిలీ ఎంత ఎదురు చూస్తుందో తెలియదు కానీ.. మెగా ఫాన్స్ మాత్రం అతృతతో ఉన్నారు. ఈ రోజు ఈవెనింగ్ కానీ, రేపు ఉదయం కానీ పవన్ వెళ్లే సూచనలు ఉన్నాయంటుంటే.. నిశ్చితార్ధానికి హ్యాండ్ ఇచ్చిన పవన్ పెళ్ళికి కూడా డుమ్మా కొడతాడని.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.