పవన్ కళ్యాణ్ నాగబాబు కూతురు నిహారిక పెళ్ళికి ఎప్పుడు వేళ్తాడో అని మెగా ఫాన్స్ కి మాత్రమే కాదు.. అందరికి క్యూరియాసిటీగానే ఉంది. ఎందుకంటే నాగబాబు కూతురు పెళ్ళికి చిరంజీవి నిన్ననే రాజస్థాన్ వెళ్ళిపోయాడు. సినిమాలతో బాగా బిజీగా ఉన్న అల్లు ఫ్యామిలీ, రామ్ చరణ్ అంతా నిహారిక పెళ్ళిలో సందడి చేస్తుంటే.. అక్కడ ఏదో లోటు. అదే నాగబాబు బుజ్జి తమ్ముడు పవన్ కళ్యాణ్ లేకపోవడం. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉంటున్నాడు నిహారిక పెళ్ళికి ఎప్పుడు వెళ్తాడా అని ఎదురు చూస్తుంటే.. పవన్ సైలెంట్ గా రాజస్థాన్ ఉదయపూర్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు.
అది కూడా కొడుకు అకీరా తో కలిసి పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్ళికి వచ్చేశాడు. ఇంతవరకు నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో పవన్ ఫ్యామిలిలో ఎవరూ కనిపించలేదు. ఆయన మూడో భార్య కానీ, కొడుకు కానీ కనిపించలేదు. అలాగే ఆద్య కానీ అకీరా కానీ నిహారికతో పెళ్లికి వెళ్ళలేదు. కానీ పవన్ కళ్యాణ్ తో కలిసి అకీరా అక్క నిహారిక పెళ్ళికి ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ రాక కాస్త ఆలస్యమైనా.. కొడుకు అకీరా నందన్ తో నిహారిక పెళ్ళికి వెళ్లడం మెగా ఫాన్స్ కి మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీకి ఫుల్ హ్యాపీనే కదా.. మరి లేట్ గా వెళ్లినా లేటెస్ట్ గా కొడుకుతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.