Advertisementt

మెగా పెళ్ళికి ఆహ్వానాలు లేకపోయినా.. ఆ ఇద్దరు మాత్రం!

Thu 10th Dec 2020 01:36 PM
ritu varma,lavanya tripathi,niharika wedding  మెగా పెళ్ళికి ఆహ్వానాలు లేకపోయినా.. ఆ ఇద్దరు మాత్రం!
Even if there are no invitation for mega wedding .. those are the two who went!! మెగా పెళ్ళికి ఆహ్వానాలు లేకపోయినా.. ఆ ఇద్దరు మాత్రం!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ పెళ్ళికి ఇండస్ట్రీలో పెద్దలెవరికి ఆహ్వానాలు లేవు. కారణం ఒకటి రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే మరొకటి కరోనా. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిహారిక పెళ్లి కుటుంబ సభ్యులు, చుట్టాల మధ్యన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 9 అంటే ఈ రోజు రాత్రి నిహారిక పెళ్లి జరగబోతుంది. అయితే ఈ పెళ్లికి ఇండస్ట్రీ వారిని కానీ, పొలిటికల్ లీడర్స్ కి కానీ ఆహ్వానాలు అందలేదు. అయితే పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరగబోయే నిహారిక - చైతన్య ల రిసెప్షన్ ని ఇండస్ట్రీ ప్రముఖులు - రాజకీయనాయకులను పిలిచి గ్రాండ్ గా ఫంక్షన్ చెయ్యబోతున్నట్టుగా టాక్ అయితే ఉంది. మరి ఇండస్ట్రీ నుండి నిహారిక పెళ్ళికి ఎవరు వెళ్లలేదనే విషయం తెలిసిందే.

కానీ ఓ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం నిహారిక పెళ్ళిలో కుటుంబ సభ్యుల వలే తెగ సందడి చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ రాజస్థాన్ కి వెళ్లిన రోజే ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా రాజస్థాన్ లో వాలిపోయారు. వాళ్లెవరో కాదు.. రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి. మరి వరుణ్ తేజ్ పిలిచాడో.. లేదంటే నిహారిక ఫ్రెండ్స్ కనక నిహారిక ఇన్వైట్ చేసిందో తెలియదు కానీ.. లావణ్య త్రిపాఠి, రీతూ వర్మలు నిహారిక వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో హడావిడి చేస్తూ సెల్ఫీలు దిగుతూ రచ్చ చేస్తున్నారు. రీతూ వర్మ అల్లు అర్జున్ తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏదిఏమైనా ఇండస్ట్రీలో ఎవరికీ ఆహ్వానం లేకపోయినా.. ఈ ఇద్దరు హీరోయిన్స్ కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చారన్నమాట.

Even if there are no invitation for mega wedding .. those are the two who went!!:

Ritu varma and Lavanya tripathi attend Niharika's wedding!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ