Advertisementt

ఢీ డాన్సర్స్ కిడ్నాప్!

Thu 10th Dec 2020 09:19 PM
dhee programme,jabardast program,comedian,shee contestant,baba bhaskar,roja  ఢీ డాన్సర్స్ కిడ్నాప్!
Jabardasth team kidnapping Dhee contestants ఢీ డాన్సర్స్ కిడ్నాప్!
Advertisement
Ads by CJ

ఈ టివి లో టాప్ షోస్ ఏమిటి అంటే జబర్దస్ కామెడీ షో.. అలాగే ఢీ డాన్స్ షో అంటారు. జబర్దస్ కమెడియన్స్ ఒక్కోసారి కాంట్రవర్సీలకు నెలవుగా మారితే.. తాజాగా ఢీ షో కూడా కాంట్రవర్సీకేక్కేసింది. ఈ బుధవారం ఢీ డాన్స్ ఫైనల్స్ విషయంలో శేఖర్ మాస్టర్ కి డాన్సర్ అక్సా ఖాన్ మధ్యన వార్ జరిగింది అని, ఎందుకంటే పండు ఎలిమినేషన్స్ కి, రాజు ఎలిమినేషన్స్  విషయంలో శేఖర్ మాస్టర్ ఎదొ రాజకీయాలు చేశాడంటూ అక్సా ఖాన్ ఢీ  స్టేజ్ మీదే ఫైర్ అయ్యింది అనే ప్రచారం  జరిగింది.ఇక జబర్దస్త్ కమెడియన్స్ స్టేజ్ మీద కొన్ని కాంట్రవర్సీ స్కిట్స్ చేసినా.. పెద్ద వివాదం అవ్వలేదు. అయితే నువ్వా - నేనా అంటూ దూసుకుపోతున్న ఈ రెండు షోస్ ఈసారి కొట్టుకోబోతున్నాయ్. ప్రతి ఏడాది డిసెంబర్ 31 న ఢీ - జబర్దస్త్ షో లు నువ్వా - నేనా అని ఢీ కొడుతుంటాయి. అందులో నాగబాబు జబర్దస్త్ లో ఉండగా హోరా హోరీగా తరుణ్ మాస్టర్ తో పోటీ పడేవారు.

కానీ ఈ డిసెంబర్ 31 న ఢీ డాన్సర్లుని జబర్దస్త్ వాళ్ళు ఏకంగా కిడ్నాప్ చేసేసారు. ఢీ డాన్స్ స్టేజ్ 31 నైట్ తమకి కావాలంటూ అదిరే అభి బ్యాచ్ ఢీ స్టేజ్ మీదకొచ్చి యాంకర్ ప్రదీప్ తో గొడవ పెట్టుకున్న ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఢీ డాన్సర్స్ ని కిడ్నాప్ చేసి ఓ చోట బందించాము.. మాకు స్టేజ్ కావాలి.. వచ్చే గురువారం వరకు మీకు టైం అంటూ శేఖర్ మాస్టర్ కి అదిరే అభి మిగతా కమెడియన్స్ వార్నింగ్ ఇవ్వగా.. దానికి శేఖర్ రిక్వెస్ట్ చేసినా అభి వాళ్ళు ఆగడం లేదు. ఇక బాబా మాస్టర్ అయితే కత్తితో మా ఢీ డాన్సర్స్ ని విడుదల చెయ్యకపోతే మీ అంతు తెలుస్తా అంటున్నాడు. మరి డిసెంబర్ 31st నైట్ డీజే స్పెషల్ ప్రోగ్రాం కోసం జబర్దస్త్ కమెడియన్స్ ఇలా ఢీ డాన్సర్స్ ని కిడ్నాప్ చేసి ఢీ స్టేజ్ మీదకి వచ్చెయ్యబోతున్నారు. ప్రస్తుతం ఢీ కిడ్నాప్ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Jabardasth team kidnapping Dhee contestants:

Etv special 'DJ' promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ