Advertisementt

నిశ్చయ్‌ పెళ్లితో హ్యాపీగా ఉంటే.. ఈ వార్తలేంటి?

Sun 13th Dec 2020 10:20 AM
pawan kalyan,niharika wedding,anna lezhneva  నిశ్చయ్‌ పెళ్లితో హ్యాపీగా ఉంటే.. ఈ వార్తలేంటి?
Nischay happy with marriage .. what are this rumors now నిశ్చయ్‌ పెళ్లితో హ్యాపీగా ఉంటే.. ఈ వార్తలేంటి?
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలిలో చిన్న విషయమైనా అది మీడియాకి పెద్దదిగానే కనబడుతుంది. మెగా ఫ్యామిలిలో జరిగే ఏ చిన్న విషయాన్నీ నెటిజెన్స్ దగ్గరనుండి మీడియా వరకు ఎవ్వరూ వదలరు. ఈకలు పీకలు లాగి వదులుతారు. తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక పెళ్లి వేడుకల్లో మునిగిపోయింది. మెగా ఫ్యామిలి చిరు, నాగబాబు, పవన్ అందరూ కలిసి నిహారికని చైతన్య చేతిలో పెట్టి ఆనందించారు. పవన్ అయితే తన కొడుకు ఆద్య, అకీరాలతో నిహారిక పెళ్ళికి ఒక్కరోజు ముందే వెళ్లి అన్ని ఫంక్షన్స్ లోను సందడి చేసాడు. మరి అదే ఆనందంతో స్పెషల్ ఫ్లైట్స్ లో హైదరాబాద్ కి చేరుకున్నాయి మెగా ఫామిలీస్ అన్ని. కానీ ఆ ఆనందాన్ని ఒక్కరోజు నిలువనియ్యలేదు నెటిజెన్స్ అండ్ మీడియా వాళ్ళు.

నిహారిక పెళ్ళికి అందరూ వచ్చారు కానీ.. పవన్ మూడో భార్య అన్నా లేజ్నోవా ఎక్కడా? ఆయన మూడో భార్య కొడుకు ఎక్కడ? నిహారిక పెళ్లిలో కనబడలేదు. కేవలం రేణు కి పుట్టిన ఆద్య, అకీరా లు తప్ప అంటూ మొదలెట్టేసారు. పవన్ తో తన భార్య నిహారిక పెళ్ళికి వెళ్లకపోవడానికి కారణాల గురించి ఆరాలు మొదలయ్యాయి. చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్ళిలో తెగ హడావిడి చేసిన అన్నా లేజ్నోవా నిహారిక పెళ్ళికి డుమ్మా కొట్టడానికి కారణాలు అంతుబట్టక అందరి బుర్రలు వేడెక్కిపోతున్నాయి. అసలు అన్నా ఇండియాలోనే ఉందా? ఉంటే పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? లేదా క్రిష్ట్మస్ వేడుకలకు స్వదేశానికి వెళ్లిందా? అనే అనుమానము.. అబ్బో నిహారిక పెళ్ళిలో పవన్ మూడో భార్య మిస్ అవడానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారు జనాలు.

మరోపక్క పవన్ - అన్నాకి విభేదాల కారణంగానే అన్నా నిహారిక పెళ్ళికి రాలేదని, కాదు క్రిష్ట్మస్ కి అన్నా లేజ్నోవా గత నెలలోనే రష్యా వెళ్లడంతోనే నిహారిక పెళ్ళికి రాలేకపోయింది అంటున్నారు. మరి పవన్ భార్య నిహారిక పెళ్ళికి ఎందుకు రాలేదో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్న ప్రశ్న.

Nischay happy with marriage .. what are this rumors now:

Reason For pawan Kalya Wife anna lezhneva Absence In Niharika's Wedding

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ