Advertisementt

తెలివైన అభిజిత్ ని బురిడీ కొట్టించిన బిగ్ బాస్!

Sun 13th Dec 2020 03:18 PM
abhijeet,bigg boss 4,trap  తెలివైన అభిజిత్ ని బురిడీ కొట్టించిన బిగ్ బాస్!
Bigg boss sketch worked on intelligent Abhijeet తెలివైన అభిజిత్ ని బురిడీ కొట్టించిన బిగ్ బాస్!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ మొదలైనప్పటినుండి చాలా డీసెంట్ గా ఉన్న అభిజిత్ టాస్క్ విషయంలో పర్ఫెక్ట్ గా పెరఫార్మెన్స్ ఇవ్వలేదనేది బుల్లితెర ప్రేక్షకుల అభిప్రాయం. అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్న అభిజిత్ టాస్క్ విషయంలోనూ, మోనాల్ విషయంలోనూ మైనస్ అయ్యేవాడు. ఇక అభిజిత్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఒకటికి 100 సార్లు చదివి తెలివిగా అలోచించి గేమ్ ఆడతాడని బిగ్ బాస్ ని ఫాలో అవుతున్న ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. ఆట మీద గట్టిగా ఫోకస్ పెట్టే అభిజిత్ ఫిజికల్ టాస్క్ విషయంలో కామ్ గా ఉండిపోతాడు. అభిజిత్ కి ఏదో ప్రాబ్లెమ్ ఉండబట్టే అభిజిత్ ఫిజికల్ టాస్క్ ఆడడని చాలామంది అంటున్నారు. అయితే టాస్క్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే అభిజిత్ ని బిగ్ బాస్ చివరి టాస్క్ ల్లో బురిడీ కొట్టించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

బిగ్ బాస్ టాస్క్ లెటర్ పంపగానే దాన్ని ఒకటికి 100 సార్లు చదివేసి అందులో ఏదో ఒక టెక్నీక్ పట్టుకుని.. టాస్క్ గెలిచే యోచనలో అభిజిత్ ఉండేవాడు.  అలాంటిది నిన్న రాత్రి బిగ్ బాస్ టాస్క్ విషయంలో అభిజిత్ మోసపోయాడు. నిన్న రాత్రి బిగ్ బాస్ స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఆగకూడదు, కూర్చోకూడదు, అంటూ సరిపోని సైజు షూస్ తో కంటెస్టెంట్స్ కి స్టేజ్ డాన్స్ టాస్క్ ఇవ్వగా.. అందులో అరియానని ముందు దిగమంటే నేను సెకండ్ దిగుతా అంటూ అందరితో వాదిస్తుంది అరియనా. హౌస్ మేట్స్ అందరూ అరియానాతో మాట్లాడుతుంటే.. ఆభిజీత్ కూడా అరియానని దిగమంటూ వాదించక.. సైలెంట్ గా స్టేజ్ మీద కూర్చుండి పోయాడు. దానితో హారిక - మోనాల్ లు అభి స్టాండ్ అప్.. కూర్చో కూడదు. కూర్చుంటే అవుట్.. లే అనగానే లేచిన అభిజిత్ అయ్యో నాకు తెలియదు అంటే.. నిజమే తెలియదు అని హారిక చెప్పగా, బిగ్ బాస్ తాను ఇచ్చిన టాస్క్ లో అన్ని చెప్పారంటూ అఖిల్ బుక్ తెచ్చి చదివాడు. మరి ఒక్కో టాస్క్ వివరాలను పదే పదే చదివే అభిజిత్ ఆ డాన్స్ టాస్క్ విషయంలో చదవకపోడంతో ఫస్ట్ స్టేజ్ మీదనుండి దిగాల్సి వచ్చింది. 

Bigg boss sketch worked on intelligent Abhijeet:

Abhijeet in bigg boss trap

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ