Advertisementt

అది సినిమా వరకే.. ఒరిజినల్ గా నా కేరెక్టర్ అదికాదు!

Sun 13th Dec 2020 10:51 PM
kiara advanui,indoo ki jawani  అది సినిమా వరకే.. ఒరిజినల్ గా నా కేరెక్టర్ అదికాదు!
That's just until the movie, that's not my original character! అది సినిమా వరకే.. ఒరిజినల్ గా నా కేరెక్టర్ అదికాదు!
Advertisement
Ads by CJ

సినిమాలోని పాత్రలకి నిజ జీవితానికి చాలా తేడాలుంటాయియి. నిజ జీవితంలో ట్రెడిషనల్ గా ఉండే హీరోయిన్స్.. పాత్ర డిమాండ్ మేరకు బికినీ షో కూడా చేసేస్తారు. మొన్నామధ్యన బికినీ షో చేయడం నచ్చదు కానీ.. కథ డిమాండ్ చేస్తే చెయ్యాల్సిందే అంటూ తాప్సి బికినీ వేదాంతం మాట్లాడింది. తాజాగా కియారా అద్వానీ అయితే రొమాన్స్ విషయంలో మరింత బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న కియారా అద్వానీ డ్రెస్సింగ్ స్టయిల్ కానీ, ఆమె గ్లామర్ షో కానీ ఈ తరం అమ్మాయిలకి సరిగ్గా సరిపోతుంది. ఈ తరం అమ్మాయిలు డేటింగ్ యాప్స్ చేతిలో ఎలా మోసపోతున్నారో అనేది కియారా తాజా చిత్రం ఇందూకి జవానీ కథ.

ప్రస్తుతం ఇందూకి జవానీ ప్రమోషన్స్ లో ఉన్న కియారా.. సినిమాలో ఇందు పాత్రలో డేటింగ్ యాప్స్ కి అడిక్ట్ అయ్యే బోల్డ్  పాత్ర చేసింది.. అలాంటి బోల్డ్ కేరెక్టర్ చేసిన కియారా మరి నిజ జీవితంలో కేరెక్టర్ ఎలా ఉంటుందో అనే సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. తాను ఇందూకి జవానీ లో ఈ తరం అమ్మాయిలా బోల్డ్ గా నటించాను. కానీ నాది ఒరిజినల్ కేరెక్టర్ అలాంటిది కాదు. నా రొమాంటిక్ స్టయిల్ చాలా పాత పద్ధతిలో ఉంటుంది. ఈతరం అమ్మాయిల్లా నేను డేటింగ్ యాప్స్ దగ్గరకు వెళ్లాలనుకోవడం లేదంటూ రొమాన్స్ విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది కియారా. మరి ఎంత మోడ్రెన్ అమ్మాయి అయినా.. ఇలా రొమాన్స్ విషయంలో తన మనసులో మాటను బయటపెట్టి.. కాలంతో పాటు అన్నీ మారాలని రూలేమీ లేదుగా అంటూ అందరికి షాకిచ్చింది కియారా.

That's just until the movie, that's not my original character!:

Kiara Advani says she doesn't buy into the idea of dating apps

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ