Advertisementt

పిల్లల్ని ఎలా కనాలో చెప్పిన నాగ్!

Mon 14th Dec 2020 12:42 PM
nagarjuna,bigg boss 4,bigg boss telugu,abhijeeth,sohail,ariyana  పిల్లల్ని ఎలా కనాలో చెప్పిన నాగ్!
Nagarjuna gives content to meme creators పిల్లల్ని ఎలా కనాలో చెప్పిన నాగ్!
Advertisement
Ads by CJ

నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో సోహైల్ కి అరియనాకి కలిపి గట్టి క్లాస్ ఇచ్చిన నాగార్జున కాస్త కామెడీ కూడా చేసాడు. అభిజిత్ ని కొన్ని పాయింట్స్ అడగాలంటూ నాగ్ బిగ్ బాస్ స్టేజ్ మీద కామెడీ చేసాడు.  ఇక సోహైల్ ని కుర్చీ మీద కూర్చున్నప్పుడు, టాస్క్ లో ఉన్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావ్ కానీ ఆటలో లేనప్పుడు ఎందుకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదంటూ కోప్పడగా.. అరియానని విమెన్ కార్డు ఎందుకు వాడవు అంటూ షాంపూ లేకుండానే తలంటేసాడు నాగార్జున. అరియనా అయితే ఏడుపుకి.. ఇంకేదో ఫీలింగ్ కి మధ్యన ఉండగా.. సోహైల్ అతి ఓవేరేక్షన్ చేసాడు. 

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ క్లాస్ అయ్యాక టాప్ 5 కి వెళ్లే రెండో కంటెస్టెంట్స్ గా సోహైల్ పేరు వచ్చింది.  అలాగే అభిజిత్ ని నాగ్ అభి పిల్లలెలా పుడతారు.. ఆ ప్రశ్న ని మోనాల్ ని అడిగావ్ కదా అని కామెడీ చెయ్యగా.. సర్ సర్ అంటూ అభి టెంక్షన్ అయ్యాడు. దానికి నాగార్జున మీమ్స్ చేసే వాళ్ళకి చక్కటి మీమ్ వేసుకొండి అంటూ పిల్లలెలా పుడతారంటే అంటూ.. ఏడుస్తూ పిల్లలు పుడతారంటూ నాగార్జున చేసిన కామెడీకి కంటెస్టెంట్స్ అందరూ ఫక్కున నవ్వగా.. అభిజిత్ అయితే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. మరి నాగ్ పిల్లలెలా పుడతారో చెప్పి నిజంగానే బిగ్ బాస్ స్టేజ్ పై నవ్వులు పూయించాడు.

Nagarjuna gives content to meme creators:

Nagarjuna gives content to meme creators

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ