Advertisementt

హౌస్ లోకి ఫస్ట్ వచ్చింది.. లాస్ట్ లో వెళ్ళింది!

Sun 13th Dec 2020 10:56 PM
monal gajjar,bigg boss 4,bigg boss telugu,nagarjuna  హౌస్ లోకి ఫస్ట్ వచ్చింది.. లాస్ట్ లో వెళ్ళింది!
Entered the Bigg boss house first, Eliminated in the Last! హౌస్ లోకి ఫస్ట్ వచ్చింది.. లాస్ట్ లో వెళ్ళింది!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 కాస్త లేట్ గా స్టార్ట్ అయ్యింది. కరోనా కారణంగా సెప్టెంబర్ 6 న బిగ్ బాస్ మొదలయ్యింది. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా మోనాల్ గజ్జర్ అడుగుపెట్టింది. గోవిందా గోవిందా అంటూ బిగ్ బాస్ హౌసులోకి అడుగుపెట్టిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ టాస్క్ ల పరంగా చాలా వీక్. అలాగే హౌస్ లో ఉన్న దేవి నాగవల్లి, దివి, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి లాంటి కంటెస్టెంట్స్ ముందు మోనాల్ తేలిపోయినా.. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం మోనాల్ ని ఆఖరి వరం వరకు కాపాడుకుంటూ వచ్చింది. ఎంతమంది ఎన్ని అన్నా బిగ్ బాస్ యాజమాన్యం లెక్కచేయ్యలేదు. 

మోనాల్ ని నాలుగో వారం నుండి కాపాడుకుంటూ.. పస ఉన్న కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చింది. ఇక చివరి వారంలో చివరిగా మోనాల్ ఎలిమినేషన్ తప్పలేదు. బిగ్ బాస్ తప్పించలేదు. ఆరియానా కి మోనాల్ కి మధ్యన చివరి ఎలిమినేషన్ పడగ.. అందులో అరియనా టాప్ 5 కి వెళ్లిన చివరి కంటెస్టెంట్ అయితే.. మోనాల్ చివరి వారంలో ఎలిమినేట్ అయిన చివరి కంటెస్టెంట్ గా బయటికి వచ్చింది. మరి హౌసులోకి మొదటగా అడుగుపెట్టి గోవిందా గోవిందా అన్న మోనాల్ హౌస్ నుండి చివరి వారంలో చివరిగా ఎలిమినేట్ అయ్యి గోవిందా గోవిందా అంటూ రికార్డ్ సృష్టించింది. ఇక హౌస్ నుండి బయటికి వస్తూ గోవిందా గోవిందా అంటూ బయట స్టేజ్ మీదకొచ్చాక కూడా అదే గోవిందా నామ జపంతో మోనాల్ ఇంటికి వెళ్ళిపోయింది.

Entered the Bigg boss house first, Eliminated in the Last!:

Monal Eliminated From Bigg Boss House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ