Advertisementt

చరణ్, బన్నీ పెళ్లిళ్లు ఎంజాయ్ చేయలేకపోయాం.. అందుకే ఇలా..!

Tue 15th Dec 2020 08:53 AM
nagababu,niharika wedding,niharika destination wedding,chaitanya,varun tej  చరణ్, బన్నీ పెళ్లిళ్లు ఎంజాయ్ చేయలేకపోయాం.. అందుకే ఇలా..!
Bunny and Cherry could not enjoy their wedding చరణ్, బన్నీ పెళ్లిళ్లు ఎంజాయ్ చేయలేకపోయాం.. అందుకే ఇలా..!
Advertisement
Ads by CJ

నిహారిక - చైతన్య పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. పెళ్లి, రిసెప్షన్ అన్ని మెగా ఫ్యామిలీ అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేసింది. అయితే నిహారిక అసలు డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు చేసుకోవాలనుకుంది.. నాగబాబు ఆ వెడ్డింగ్ కి ఎందుకు ఓకె చెప్పాడో నాగబాబు మాటల్లోనే విందాం. నిహారిక పెళ్లి వేడుకలు ముగియడంతో కాస్త ఫ్రీ అయినా నాగబాబు నిహారిక పెళ్లి గురించి ఓ వీడియో షేర్ చేసాడు. అందులో నాగబాబు నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో చెప్పాడు. పెళ్లి అంటే బందు మిత్రుల ఆహ్వానాలు, వారికి అతిధి మర్యాదలు, ఇంకా పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడం అంటే మాములు విషయం కాదు. అందులోనూ ఇది కరోనా టైం కూడా. నాగబాబు నిహారిక పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ గా చెయ్యడానికి కరోనా కారణం ఒకటైతే.. మరోకటి పెళ్లి ని ఎంజాయ్ చెయ్యడం కోసమే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంచుకున్నామని చెబుతున్నాడు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ పెళ్ళిళ్ళకి అసలు ఎంజాయ్ చేయలేకపోయామని, ఎందుకంకే వారి పెళ్ళికి కొన్ని వేలమంది హాజరవడంతో వారికి అతిధిమర్యాదలతో, ఇంకా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయి అలిసిపోయామని, కాబట్టి ఎంజాయ్ చేయలేకపోయామని.. కానీ నిహారిక పెళ్లి లో కరోనా కారణంగా పెద్దగా ఎవరిని పిలవలేదు కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుని మా మెగా ఫామిలీస్ అన్ని కలిసి ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశామంటున్నాడు నాగబాబు. నిహారిక పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఎలాంటి హడావిడి లేకుండా బాగా ఎంజాయ్ చేశామని అంటున్నాడు. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నాము. నిహారిక - చైతన్య ఇష్టప్రకారమే ఈ వెడ్డింగ్ ని ప్లాన్ చేసాము. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ పనులన్నీ వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకున్నాడంటూ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిహారిక పెళ్లి విశేషాలను వీడియో రూపంలో పంచుకున్నాడు.

Bunny and Cherry could not enjoy their wedding:

Nagababu Reveals the reason behind the Niharika destination wedding

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ