బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకి డేట్ దగ్గరపడుతోంది. వచ్చే ఆదివారమే స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేని బిగ్ బాస్ యాజమాన్యం ఓ రేంజ్ లో ప్లాన్ చెయ్యబోతుందట. ఇప్పటివరకు పెద్దగా క్రేజ్ లేని బిగ్ బాస్.. గ్రాండ్ ఫినాలేతో అయినా టిఆర్పి రేటింగ్స్ ని తిరగరాయాలని చూస్తుంది. అయితే టాప్ 5 లో కొనసాగుతున్న అభిజిత్, అఖిల్, సోహైల్, హారిక, అరియానాలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విన్నర్ అయితే అవ్వాల్సిందే. కానీ ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో అభిజిత్ విన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కాదు సింగరేణి ముద్దు బిడ్డ సోహైల్ బిగ్ బాస్ విన్నర్ అవడం ఖాయం అంటున్నారు సోషల్ మీడియా అభిమానులు. ఇక ఈ ఆదివారం జరగబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ పై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
గత ఏడాది నాగ తో పాటుగా చిరు బిగ్ బాస్ విన్నర్ ని సెలెక్ట్ చేస్తే ఈ ఏడాది నాగ్ తో పాటుగా బిగ్ బాస్ స్టేజ్ మీద మహేష్ కూడా ఉండబోతున్నాడని.. ఈసారి సూపర్ స్టార్ సీజన్ 4 ఫినాలే గెస్ట్ అనే టాక్ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. కానీ తాజాగా ఎన్టీఆర్ ఈసారి ఫినాలే గెస్ట్ అని.. కాదు మళ్ళీ చిరునే రిపీట్ చేస్తున్న స్టార్ మా అంటూ ఎన్టీఆర్ - మహేష్ - చిరుల పేర్లు తెర మీద చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ఆదివారం వచ్చేస్తుంది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ ఎవరో తేల్చండయ్యా అంటూ ఆయా హీరోల ఆభిమానులు సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేసారు.