వారం క్రితం సోషల్ మీడియాలో ఒక్కరిగా సింగర్ సునీతా ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. సింగర్ సునీత రెండో పెళ్లి విషయం హాట్ హాట్ గా వైరల్ అయ్యింది. తనకి కాబోయే భర్త రామ్ ని అభిమనులకి పరిచయం చేసిన సునీత రామ్ తో ఏడడుగులు నడవబోతున్నట్టుగా చెప్పి తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాకిచ్చింది. షాక్ ఎందుకంటే సునీత కి ఇద్దరు పిల్లలు, వాళ్ళు పెరిగి పెద్దవారైన టైములో సునీత తోడు కోరుకోవడం కొంతమందికి ఆశ్చర్యం కలిగించినా.. ఆమె సెకండ్ మ్యారేజ్ విషయంలో చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేసారు. అయితే రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సునీత పెళ్లి ఈ నెలాఖరులో జరగబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
డిసెంబర్ 27న సునీత - రామ్ ల వివాహం.. సింపుల్ గానే జరగబోతున్నట్లుగా చెప్పారు. ఎప్పుడెప్పుడు సునీత ని పెళ్లి బట్టల్లో కొత్త పెళ్లి కూతురిలా చూడాలని ఆమె అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ తాజాగా బయటికొచ్చిన న్యూస్ ప్రకారం సునీత రెండో పెళ్లి వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. అసలు 2020 లో సునీత పెళ్లి చేసుకోవడం లేదని.. 2021లో సునీత పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి వచ్చే ఏడాది పెళ్లి అంటే.. వచ్చే ఏడాది మే ఆఖరి వరకు పెళ్ళిళ్ళకి మంచి ముహుర్తాలు లేవంటున్నారు పండితులు. దీనిబట్టి చూస్తే సునీత సెకండ్ మ్యారేజ్ వచ్చే ఏడాది మే తర్వాత ఉండే ఛాన్సెస్ ఉన్నాయేమో. మరి సునీత ని పెళ్లి కూతురుగా చూడాలంటే ఆమె అభిమానులు ఇంకొన్నాళ్లు ఆగాలి. ఇక వ్యక్తిగత కారణాల వలనే సునీత ఫ్యామిలీ, వరుడు రామ్ ఫ్యామిలీ కూర్చుని మట్లాడుకుని ఈ పెళ్లి వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది.