బిగ్ బాస్ సీజన్ 4 బోర్ బోర్ అంటుండగానే ఫైనల్ వీక్కి చేరిపోయింది. సీజన్ మొదలయ్యింది.. బిగ్ బాస్ చూసేద్దాం.. కాస్త కాలక్షేపం అవుతుంది అనుకుంటే.. బిగ్ బాస్ ఏ దశలోనూ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించలేదు. కానీ నిజం చెప్పాలంటే బిగ్ బాస్ అప్పుడే చివరి వారంలోకి వచ్చేసిందా అనిపిస్తుంది. ప్రస్తుతం ఫైనల్ వీక్ లో ఉన్న 5 గురిలో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అనేది సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముందు నుండి బాగా క్రేజ్ ఉన్న అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అంటూ ఆయన అభిమానులే కాదు.. చాలామందే ఫిక్స్ అయ్యారు. ఏదైనా మిరాకిల్ జరిగితేనే వేరేవారికి టైటిల్ ట్రోఫీ దక్కుతుంది అంటూ సోషల్ మీడియాలో అభిజిత్ మ్యానియా ఊగిపోతోంది.
ప్రస్తుతం బిగ్ బాస్ ఓటింగ్స్ బట్టి కూడా అభిజిత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని, ప్రతి వారం నామినేషన్స్ లోకి వచ్చే అభిజిత్ కి అందరికన్నా ఓటింగ్ శాతం ఎక్కువ ఉండబట్టే అభిజిత్ ఇన్నాళ్లు సేవ్ అవుతూ హౌస్లో ఉన్నాడంటుంటే.. ఈ వారం ఓటింగ్ తో బిగ్ బాస్ విన్నర్ గా ఫిక్స్ అవుతాడని టాక్ ఉండడంతో అందరూ అభిజిత్కే ఓట్స్ వేస్తున్నారట. అభిజిత్ ఓటింగ్ శాతం చూసాక విన్నర్ గా అందరూ అభినే ఫిక్స్ అయ్యేలా కనబడుతుంది. ఓటింగ్ లో అభిజిత్ కి ఏకంగా మొత్తం పోలవుతున్న ఓట్స్ లో 50 నుండి 55 శాతం ఓట్స్ పడుతుంటే.. మిగతా 45 శాతం ఓటింగ్స్ ని మిగిలిన నలుగురు పంచుకుంటున్నారట. ఆ నలుగురిలో సెకండ్ పొజిషన్ కోసం టఫ్ ఫైట్ ఉంటుంది అని.. ఈ ఓటింగ్ ప్రకారం అభిజిత్ విన్నర్ అవడం పక్కా.. ఇది ఫిక్స్ అవ్వండి అంటూ అభిజిత్ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో అభిజిత్ విన్నర్ అంటూ హంగామా స్టార్ట్ చేశారు.