Advertisementt

అప్పుడు బాలయ్య.. ఇప్పుడు డైరెక్ట్‌గా..!

Wed 16th Dec 2020 08:10 PM
sehari,new look,hero heroine look,balakrishna,harsh,simran  అప్పుడు బాలయ్య.. ఇప్పుడు డైరెక్ట్‌గా..!
Sehari Movie Hero Heroine Look released అప్పుడు బాలయ్య.. ఇప్పుడు డైరెక్ట్‌గా..!
Advertisement
Ads by CJ

హ‌ర్ష్ కానుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి హీరో హీరోయిన్లుగా వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 1గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘సెహ‌రి’. సంగీత ద‌ర్శ‌కుడు కోటి కీల‌క పాత్ర పోషిస్తున్నఈ చిత్రాన్నిజ్ఞానసాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వంలో అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పాచౌద‌రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ విడుద‌ల చేయ‌గా, ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

లేటెస్ట్‌గా బుధ‌వారం హీరో హీరోయిన్ల లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్‌లో ఇద్ద‌రి లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. హీరో హ‌ర్ష్ ముఖంలో ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, హీరోయిన్ సిమ్రాన్ చౌద‌రి అత‌డి వైపు న‌వ్వు ముఖంతో చూస్తోంది. పోస్ట‌ర్‌లో గిటార్‌, తోర‌ణాలు, క్రాక‌ర్స్ వెలుగులు లాంటివి క‌నిపిస్తూ, సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రానికి సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్త‌యింది. 2021లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా, ప్ర‌శాంత్ ఆర్‌. విహారి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం:

హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి, కోటి, బాల‌కృష్ణ (సీనియ‌ర్ యాక్ట‌ర్)‌‌, అభిన‌వ్ గోమ‌టం, ప్ర‌ణీత్ క‌ళ్లెం, అనీషా ఆళ్ల‌, అక్షి‌త శెట్టి, రాజేశ్వ‌రి, సృష్టి, య‌శ్వంత్‌, అనీల్ కుమార్

సాంకేతిక బృందం:

ద‌ర్శ‌క‌త్వం: జ్ఞానసాగ‌ర్ ద్వార‌క

నిర్మాత‌లు: అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌద‌రి

బ్యాన‌ర్: వ‌ర్గో పిక్చ‌ర్స్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: మేఘ‌న కానుమిల్లి

సినిమాటోగ్ర‌ఫి: సురేష్ సారంగం

సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్. విహారి

ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌

ఆర్ట్ డైరెక్ట‌ర్‌: సాహి సురేష్‌

క‌థ‌: హ‌ర్ష్‌ కానుమిల్లి

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్

Sehari Movie Hero Heroine Look released:

New Look From Sehari Released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ