Advertisementt

అందులో స్పెషల్ ఏముంది!

Thu 17th Dec 2020 11:54 AM
adivi sesh,major,sandeep unnikrishnan,major first look  అందులో స్పెషల్ ఏముంది!
What's so special about it! అందులో స్పెషల్ ఏముంది!
Advertisement
Ads by CJ

ఆర్మీ లుక్స్ లోను, పోలీస్ లుక్స్ లో కొత్తగా మేకోవర్ అవడం ఓకె గాని.. అందులో పెద్దగా వేరియేషన్స్ చూపించలేం. అల్లు అర్జున్ నా పేరు సూర్య లో లుక్ తోనూ, పేస్ ఎక్సప్రెషన్స్ తోనూ వేరియేషన్ చూపించాలనుకున్నాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. తాజాగా అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరో మహేష్ బాబు నిర్మాణంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ లుక్ ని రివీల్ చేసారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రాన్ని గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. అడివి శేష్ మేజర్ లుక్ చెప్పాలంటే రాకింగ్ గానే అనిపిస్తుంది. 

కానీ ఆ లుక్ చూడగానే గూఢచారిలో గోపి ఉరఫ్ అర్జున్ రా ఏజెంట్ అడివి శేష్ గుర్తు రావడంతో మేజర్ లుక్ లో కొత్తదనం కనిపించలేదు. ఈ సినిమాలో గూఢచారి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తుంది. మరి సేమ్ డైరెక్టర్, సేమ్ హీరో, సేమ్ హీరోయిన్, సేమ్ కాన్సెప్ట్ లా అనిపించడంతో మేజర్ లుక్ చూడగానే గూఢచారి గుర్తొస్తున్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందులోను అడివి శేష్ రొమాంటిక్ గా కన్నా ఇలాంటి ఆర్మీ, పోలీస్ లుక్స్ కి బాగా సెట్ అవుతాడు. మరి పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న మేజర్ సినిమా లుక్ లో అడివి శేష్ శత్రువుల గుండెల్లో ఒణుకు పుట్టించి వాళ్ళ మీదకి గన్ ఎక్కుపెట్టిన లుక్ నిజంగా ఆకట్టుకుంటుంది. కానీ కొత్తదనం మిస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది అంటున్నారు. మరి అడివి శేష్ మేజర్ లుక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.

What's so special about it!:

Adivi Sesh Major Sandeep Unnikrishnan First Look not that impressive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ