Advertisementt

తారక్ రేంజ్ కి తాటాకు చప్పుళ్ళు ఎందుకు.?

Fri 18th Dec 2020 04:03 PM
ypung tiger ntr,gemini show,leaked information,tarak upset  తారక్ రేంజ్ కి తాటాకు చప్పుళ్ళు ఎందుకు.?
Tarak flustered about this! తారక్ రేంజ్ కి తాటాకు చప్పుళ్ళు ఎందుకు.?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో మళ్ళీ మరోసారి బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్న విషయం గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. కానీ ఈ లీక్ న్యూస్ ల పట్ల ఎన్టీఆర్ తో సహా ఎవ్వరూ హ్యాపీ గా లేరనేది సినీ జోష్ కి అందిన సమాచారం. మనందరినీ ఎంతో ఇబ్బంది పెట్టిన ఈ 2020 ని వదిలించుకుని 2021 లోకి ఎంటర్ అవ్వబోయే టైం లో ఓ సర్ప్రైజ్ న్యూస్ లా.. ఓ సెలెబ్రిటింగ్ వార్తలా అందరికి చెప్పాలనుకున్న విషయాన్నీ ఇలా లీకేజ్ న్యూస్ ద్వారా బయటకి వచ్చెయ్యడం ఆ టీం కి కానీ, ఎన్టీఆర్ కి కానీ ఎవరికీ నచ్చడం లేదని తెలుస్తుంది

దానికి తోడు తారక్ రెమ్యునరేషన్ ఇంతా అంతా అంటూ వార్తలు వండి వార్చడం సదరు టివి మేనేజిమెంట్ కి సంతృప్తిగా అనిపించడం లేదని సమాచారం. ఇప్పటికే షో మ్యాన్ గా 

ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకున్న తారక్ మళ్ళీ స్మాల్ స్క్రీన్ కి వచ్చి ఇంటింట్లో అందరిని పలకరిస్తానంటే ఆల్ ద బెస్ట్ చెప్పి వెల్ కం చెయ్యాలే తప్ప అంకెలు చెప్పి ఒంకర లెక్కల వార్తలు రాయడం అవసరం లేదేమో..!

Tarak flustered about this!:

Tarak Upset With Leaked Information

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ