Advertisementt

డర్టీ హరి కాదు.. చీటింగ్ హరి!

Fri 18th Dec 2020 11:33 PM
dirty hari movie,friday movies,dirty hari review,att  డర్టీ హరి కాదు.. చీటింగ్ హరి!
Not Dirty Hari .. Cheating Hari! డర్టీ హరి కాదు.. చీటింగ్ హరి!
Advertisement
Ads by CJ

ఒకప్పటి సక్సెస్ ఫుల్ సినిమాల నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకుడుగా మారి వాన, తూనీగ తూనీగ సినిమాలతో బొక్కబోర్లా పడ్డాడు. అవేవి కలిసి రాక ప్రెజెంట్ రన్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో బోల్డ్ కంటెంట్ ని నమ్ముకున్నాడు. డర్టీ హరి అనే బోల్డ్ కంటెంట్ అంటూ బూతు మూవీకి దర్శకత్వం వహించాడు. డర్టీ హరి పోస్టర్స్ లోనే సినిమాలో బూతు కంటెంట్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధమైపోయింది. ఈ సినిమాపై మహిళా సంఘాల ఆగ్రహాన్ని ముట్టుకుంటూ పోలీస్ కేసుల వరకు వెళ్ళింది.  కానీ ఎం ఎస్ రాజు మాత్రం ఒక్క సాంగ్ లోనే బోల్డ్ సన్నివేశాలున్నాయంటూ పలు ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చాడు. అయితే థియేటర్స్ ఓపెన్ అయినా ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా ఓటిటి, ఏటిటి దారిలోనే ఉన్నాయి. ఎం ఎస్ రాజు డర్టీ హరి ఫ్రైడే మూవీస్ ఏటిటి  నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేసారు.

అయితే ఫ్రైడే మూవీస్ ఏటిటి నుండి విడుదలైన ఈ సినిమా చూడాలంటె 120 రూపాయలు పెట్టి టికెట్ కొనాల్సి ఉంది. ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాని మాములుగా చూడాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. మళ్ళీ డబ్బులు పెట్టి సినిమా చూడాలంటె కష్టం. కానీ కొంతమంది అంటే సినిమా విశ్లేషకులు కానివ్వండి, మీడియా పీపుల్ కానివ్వండి, సినిమా రిలేటెడ్ పీపుల్ కానివ్వండి.. సినిమా చూసేందుకు ఆసక్తి చూపి ఫ్రైడే మూవీస్ కి 120 రూపాయలు పే చేసినా కొంతమందికి ఆ సినిమా ప్లే అవడం లేదు. దానితో ఇండస్ట్రీకి రిలేటెడ్ పీపుల్ సోషల్ మీడియాలో డర్టీ హరిపై నెగెటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. అంటే ప్రస్తుతం టెక్నాలజీ అంత అద్భుతంగా 4G, 5G అంటూ పరిగెడుతున్న టైం లో డర్టీ హరి కోసం 120 రూపాయలు పెట్టినా సినిమా ప్లే అవకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా లాంటి ఓటిటీల ముందు ఫ్రైడే మూవీస్ అంటూ వచ్చిన కొత్త ఏటిటి యాప్.. కొత్త టెక్నలాజిలతో పోటీ పడాల్సింది పోయి డీలా పడడం డర్టీ హరికి మైనస్ అనే చెప్పాలి. 

ఇక 120 పెట్టి కొన్న ప్రేక్షకులు డర్టీ హరినే కాదు చీటింగ్ హరి కూడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో డర్టీ నెస్ ఎంతుందో తెలియదు కానీ.. సినిమా మాత్రం డర్టీ టాక్ తెచ్చేసుకుంది. 

Not Dirty Hari .. Cheating Hari!:

Friday Movies App releasing Dirty Hari

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ