బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా ముగిసింది. నాగార్జున వ్యాఖ్యాతగా సక్సెస్ ఫుల్ గా సీజన్ 4 ని కంప్లీట్ చేసింది స్టార్ మా. తాజాగా చిరు గెస్ట్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ అదిరిపోయింది. చిరు మెస్మరైజింగ్ స్పీచ్, నాగ్ కామెడీ ఫినాలే ఎపిసోడ్ లో మెయిన్ హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక గత కొన్నిరోజులుగా బిగ్ బాస్ విన్నర్ పై జరిగిన సర్వేలు, ప్రేక్షకుల గెస్ ఈ రోజు నిజమైంది. మొదటి నుండి బిగ్ బాస్ హౌస్ లో అన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ గేమ్ పర్ఫెక్షన్ లేకపోయినా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ ఈ సీజన్ 4 ట్రోఫీని ఎగరేసుకుపోయాడు.
అఖిల్ - అభిజిత్ టాప్ 2 లో ఉండగా.. అందరి మొహాల్లో టెంక్షన్ కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఫైనల్ గా నాగార్జున విన్నర్ ని ప్రకటించారు. ప్రేక్షకులు, అభిజిత్ అభిమానులు అనుకున్నట్టుగా సోషల్లో మీడియా టాక్ ప్రకారం అభిజిత్ ని సీజన్ 4 విన్నర్ నాగార్జున ప్రకటించాడు.పక్కనే ఉన్న చిరు అభిజిత్ కి ట్రోఫీ అందించి హగ్ చేసుకున్నాడు. వారం రోజులుగా అభిజిత్ విన్నర్ అని అందరూ ఫిక్స్ అయినా.. కొందరిలో ఎక్కడో ఏదో మూల అనుమానం. చివరికి ఓట్స్, ప్రేక్షకుల అభిమానంతో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అవతరించాడు.