సినిమాల్లోకి కం బ్యాక్ ఇచ్చాక కంటిన్యూస్ గా సినిమాలు ఒప్పేసుకుంటూ దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్.. వాటిన్నిటికి న్యాయం చేయగలడా అనే అనుమానం వస్తుంది. ఫాన్స్ కి చాలామంది ప్రేక్షకులకి. ఎందుకంటే వకీల్ సాబ్ లో చూపించాల్సిన జస్ట్ రెండు వేరియేషన్స్ పాత్రలకే వన్ ఇయర్ టైం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇక మీదట చెయ్యబోయే సినిమాలకు కూడా పవన్ లుక్ లో చాలా వేరియేషన్స్ చూపించాల్సిన అవసరం ఉంది. తాజాగా పూజ కార్యక్రమాలతో మొదలైన అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి మొదలుపెట్టనున్నారట.
మరోపక్క క్రిష్ సినిమా కూడా అదే టైం లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ సినిమానేమో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అయ్యప్పమ్ కోషియమ్ రగడు సబ్జెక్టు. మరి రెండు లుక్స్ ని పవన్ ఎలా మ్యానేజ్ చేస్తాడు. ఒకేసారి రెండు సినిమాల లుక్స్ ని మేనేజ్ చెయ్యడం అనేది మాములు విషయం కాదు. లుక్స్ లో వెరియేషన్న్ చూపించడం పవన్ వల్ల అవుతుందా.. అనేది ఇప్పుడు పవన్ ఫాన్స్ ముందున్న అతి పెద్ద ప్రశ్న. మరి కేవలం ఫాన్స్ కి మాత్రమే కాదు.. ఇప్పుడు పవన్ లుక్ విషయంలో మేకర్స్ ముందున్న ప్రశ్న కూడా అదే. మరి ఫాన్స్ కి మేకర్స్ కి పవన్ లుక్ లో వెరియేషన్న్ చూపించి సమాధానం చెబుతాడా.. అనేది వేచి చూడాల్సిందే.