జబర్డస్ట్ హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్.. గురువారం వచ్చింది అంటే జబర్దస్త్ స్టేజ్ కన్నా ముందే సోషల్ మీడియాలో అనసూయ అందాల కోసం వెతుకులాట మొదలవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అనసూయ గురువారం రాగానే తన జబర్దస్త్ ఫోటో షూట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. అందమైం భంగిమలతో.. అదిరిపోయే చిరునవ్వుతో.. ఒంక పెట్టడానికి మచ్చ లేని అందంతో అనసూయ మెరిసిపోతుంది. మంచి మేకప్ తో, అలాగే అందమైన డ్రెస్సులతో అనసూయ గ్లామర్ షో కి పడిపోని వారుండరు. అయితే అనసూయ అంత అందంగా కనిపించడానికి కారణం ఆమె మేకప్ మ్యాన్, అలాగే హెయిర్ స్టైలిస్ట్.. మిగతా టీం కారణం అంటుంది అనసూయ.
తన మేకప్ మ్యాన్ శివ కి అలాగే ఫోటో గ్రఫీ వాల్మికీ రాము, రీసెంట్ గా తన టీం లో జాయిన్ అయిన విజ్ఞాన్ అండ్ సతీష్ లకి అనసూయ థాంక్స్ చెప్పుకుంటుంది. తాను డిసెంబర్ 31 రాత్రి ఈ టివిలో ప్రసారం కాబోయే డీజే ప్రోగ్రాం కి యాంకరింగ్ చేయబోతుంది. ప్రస్తుతం ఆ షో కి సంబందించిన పిక్ తో అనసూయ తన టీం కి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తాను ఇంత అందంగా కనిపించడానికి తన టీం కారణమంటూ ఒక్కొక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.