Advertisementt

బాలయ్య బాబు ఫాన్స్ లో కొత్త ఉత్సాహం!

Mon 28th Dec 2020 08:14 AM
boyapati,balayya,bb3,telangana youth,balayya fans  బాలయ్య బాబు ఫాన్స్ లో కొత్త ఉత్సాహం!
Balayya Fans Happy with His New look బాలయ్య బాబు ఫాన్స్ లో కొత్త ఉత్సాహం!
Advertisement
Ads by CJ

బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న BB3 బడ్జెట్ పెరిగిపోయింది అని.. ఆగిపోయింది అని.. చాలా ఇబ్బందుల్లో ఉందని.. వార్తలు వండి వార్చిన గాసిప్ సైట్స్ ని చూసి కాస్త టెంక్షన్ పడ్డారు బాలయ్య ఫాన్స్. అయితే ఈ రోజుతో మాత్రం బాలయ్య ఫాన్స్ కి పెద్ద రిలీఫ్ వచ్చింది. తెలంగాణ తెలుగు యువత వెళ్లి బాలయ్య బాబుని కలవడం, ఆ ఫొటోస్ సోషల్ మీడియాలోకి రావడం.. అవి కాస్తా వైరల్ కావడం జరిగింది. ఇక్కడ ఫాన్స్ కి ఫస్ట్ రిలీఫ్ ఏమిటి అంటే BB3 షూటింగ్ జరగుతుంది అనేది తెలియడం. ఆ షూటింగ్ లొకేషన్ లో తెలంగాణ యూత్ బాలయ్యని మీట్ కావడంతో ఫాన్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చింది. దానితో చాలా హ్యాపీగా ఉన్నారు బాలయ్య ఫాన్స్ .

అలాగే BB3 స్పాట్ లో బాలయ్య బాబు లుక్ చూసి డబుల్ హ్యాపీనెస్ పొందుతున్నారు ఆయన అభిమానులు. పంచె కట్టు, వైట్ షర్ట్ అంటే ధవళ వస్త్రాల్లో ధగ ధగ మెరిసిపోతున్న బాలయ్యను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు. బోయపాటి సినిమాల్లో బాలయ్య లుక్ ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది అభిమానుల అంచనా. దాన్ని నిజం చేసేలా అద్భుతంగా ఉన్న బాలయ్య BB3 లుక్ బాలయ్య బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

Balayya Fans Happy with His New look:

Boyapati and Balayya BB3 film Shoot Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ